తెలంగాణకు ఎల్లో అలర్ట్: ఆ సమయంలో బయటికి రావొద్దంటూ సర్కారు హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. వడగాలు వీస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
ఎండ సమయంలో ప్రజలు బయటకు రావొద్దని అప్రమత్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం హెల్త్ అడ్వైజరీని విడుదల చేసింది. వాతావరణ శాఖ వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో పౌరులు బయటకు రావద్దని తెలంగాణ ఆరోగ్యశాఖ సూచించింది.

ఎండల తీవ్రత అధికంగా ఉన్న సమయంలో మద్యం, టీ, కాఫీతోపాటు చక్కెర స్థాయిలు అధికంగా ఉండే కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని కోరింది. ఎందుకంటే.. ఇవి శరీరంలో ద్రవాలను కోల్పోయేలా చేస్తాయని, అందుకే ఎండపూట వాటిని తాగవద్దని ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది. అంతేగాక, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజారోగ్య కేంద్రాల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్, మందులు అందుబాటులోని ఉంచామని తెలిపింది.
మరోవైపు, శుక్ర, శనివారాల్లో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్‌లోనూ తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 42-43°C దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రోజులు ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 సమయంలో ప్రజలు బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వడగాల్పుల తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అయితే, ఏప్రిల్ 7 తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
ఏపీ ఉక్కిరిబిక్కిరి: నడివేసవికి ముందే 45 డిగ్రీలు -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications