నాలుగు నెలల పాటు అమ్మాయిపై డ్రైవర్ అత్యాచారం
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ డ్రైవర్ అమ్మాయిపై నాలుగు నెలల పాటు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన హైదరాబాదులోని మల్లాపూర్‌లో చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న అమ్మాయిపై అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
మేడిపల్లిలోని హేమనగర్‌కు చెందిన కుమార్ అనే 21 ఏళ్ల యువకుడు స్కూల్ మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన గదిలో అమ్మాయిపై నాలుగు నెలల్లో పలుమార్లు అత్యాచారం చేశాడని నాచారం ఇన్‌స్పెక్టర్ ఎన్ ప్రవీందర్ రావు చెప్పారు.
అస్వస్థతగా ఉందని అమ్మాయి ఫిర్యాదు చేయడంతో ఆ సంఘటన శుక్రవారంనాడు వెలుగులోకి వచ్చింది. తల్లి గుచ్చి గుచ్చి అడగడంతో అసలు విషయాన్ని బాధితురాలు తల్లికి వివరించింది.

వ్యాపారి హత్య కేసులో అరెస్టులు
తాను జైలుకు వెళ్లేందుకు కారణమయ్యాడన్న కోపంతో ఓ వ్యక్తిని హత్య చేసిన పాతనేరస్తుడిని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.కార్మికనగర్ సమీపంలోని బ్రహ్మశంకర్‌నగర్‌లో నివాసం ఉంటున్న పానీపూరీ వ్యాపారి స్వామి అనే వ్యక్తికి,అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రియల్‌ఎస్టేట్ బ్రోకర్ కల్వకుర్తి వెంకటేష్(27)కు గతంలో గొడవలు ఉన్నాయి.
ఓ గొడవలో తనను జైలుకు పంపడంలో స్వామి పాత్ర ఉందనే కక్ష పెంచుకున్న వెంకటేష్ ఇటీవలే జైలునుంచి బెయిల్‌పై బయటకు వచ్చాడు.5న పానీపూరీ బండివద్ద వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తున్న స్వామిని అడ్డగించిన వెంకటేష్ కత్తితో దాడి చేశాడు.
దీంతో తీవ్రంగా గాయపడ్డ స్వామి రెండు రోజుల క్రితం చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ కేసులో నిందితుడు వెంకటేష్‌ను,అతడికి సహాయం అందించిన నర్సింగ్ అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications