లైంగిక దాడికి ప్రయత్నించిన డ్రైవర్: రోడ్డుపైకి పరుగెత్తిన లేడీ కండక్టర్
నల్లగొండ: విధి నిర్వహణలో ఉన్ మహిళా కండక్టర్‌పై అదే బస్సు డ్రైవర్ శనివారం రాత్రి లైంగిక దాడికి యత్నం చేసినట్లు నల్లగొండ జిల్లాలోని వాడపల్లి పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు పాల్పడ్డ డ్రైవర్ షేక్ సోందుపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు వాడపల్లి ఎస్‌ఐ జానయ్య తెలిపాడు. ఆదివారం ఆయన మీడియాతో ఆ విషం చెప్పారు.
మిర్యాలగూడ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సోందు, మహిళా కండక్టర్‌తో కలసి శనివారం సాయంత్రం మిర్యాలగూడ డిపో నుంచి బస్సు మండలంలోని చిట్యాల గ్రామానికి వెళ్లింది. ప్రయాణికులను దింపి తిరిగి వస్తున్న క్రమంలో రాత్రి 7గంటల ప్రాంతంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో బాల్నేపల్లి గ్రామ శివారులోని ఆంజనేయస్వామి ఆలయాని కి వెళ్లే దారికి బస్సును మళ్లించి నిలిపేశాడు.

ఆ తర్వాత మహిళా కండక్టర్ చేయిపట్టుకొనే ప్రయత్నం చేయబోయాడనీ, పరిస్థితిని గమనించిన మహిళా కండక్టర్ చేయిని విడిపించుకొని రోడ్డుపైకి పరిగెత్తి వచ్చింది. వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొని బాల్నేపల్లికి వస్తున్న ద్విచక్రవాహన దార్లని ఆపి జరిగిన విషయం చెప్పి బండిపై బాల్నేపల్లి గ్రామ సర్పంచ్ ఇంటికి చేరుకుంది. ఈ విషయం వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన విషయాన్ని మిర్యాలగూడ డిపో మేనేజర్‌కు తెలియజేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు సోందుపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపాడు. సోమవారం కోర్టు లో రిమాండ్ చేస్తామన్నారు.
బైక్‌ను కారు ఢీకొన్న సం ఘటన నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పట్టణంలోని పహడినగర్‌కు చెందిన యాసిన్, ఇస్రాన్ క లిసి వలిగొండ రోడ్డు నుంచి బైక్‌పై భువనగిరికి వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వ రంగల్‌కు వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయణిస్తున్న యాసిన్‌కు తీవ్ర గాయాలైనాయి. మెరుగైన చికిత్స కోసం యాసిన్‌ను ప్రభుత్వ దవాఖానకు తరలించారు.












Click it and Unblock the Notifications