'షీటీమ్' సభ్యులతోనే వెకిలిగా వీరు (ఫొటో)
హైదరాబాద్: ఏదో చేయబోతే ఏదో జరిగినట్లు ఇద్దరు ఆర్టీసి ఉద్యోగులు షీ టీమ్స్‌కు చిక్కారు. నిఘాలో ఉన్న షి టీమ్స్ సభ్యులతోనే వెకిలి చేష్టలకు దిగి పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన హైదరాబాదులోని మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
బస్సు స్టాపుల్లో మహిళలపై జరుగుతున్న వేధింపులపై దృష్టి సారించిన టీ టీమ్ సభ్యులు హెడ్ కానిస్టేబుల్ అమృత నేతృత్వంలో మియాపూర్ వాలెంటైన్ సర్కిల్‌లోని బస్సు స్టాండులో మఫ్టీలో నిఘా పెట్టారు. స్థానిక మియాపూర్ ఆర్టిసి డిపో 1కు చెందిన మెకానిక్‌లు జీ మనోహర్ (46), ఎస్‌కె వాజీద్ (26) మంగళవారం ఉదయం మద్యం సేవించి షీ టీమ్ నిఘా వేసిన బస్ స్టాపులోకి వచ్చారు.

అక్కడే మఫ్డీలో ఉన్న మహిళా పోలీసులకు సైగలు చేస్తూ ఫోన్ నెంబర్ అడిగారు. దీంతో వారిని షీ టీమ్ సభ్యులు అదుపులోకి తీసుకున్నారు. అ తర్వాత వారిని మియాపూర్ పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications