సాయంత్రం రెండో లిస్ట్, సినీ-పారిశ్రామికవేత్తల పేర్లు?: బడాబాబుల్లో ఆందోళన
డ్రగ్స్ రాకెట్ లింక్‌లో ఎక్సైజ్ శాఖ మరో లిస్ట్ సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరికొందరికి ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.
హైదరాబాద్: డ్రగ్స్ రాకెట్ లింక్‌లో ఎక్సైజ్ శాఖ మరో లిస్ట్ సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరికొందరికి ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు రెండో లిస్ట్ సిద్ధమవుతోంది.
కెల్విన్‌తో తరుచూ మాట్లాడే వారికి ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇస్తోంది. అయితే, మాట్లాడే వారు అందరు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు కాదని చెబుతున్నారు. విచారణలో నిజానిజాలు తేలుతాయని అంటున్నారు.

ఫోన్ లిస్ట్ ఆధారంగా..
కెల్విన్ సెల్ ఫోన్ లిస్ట్ ఆధారంగా ప్రముఖులకు నోటీసులు ఇస్తున్నారు. సాయంత్రానికి రెండో లిస్ట్ బయటకు వచ్చే అవకాశముందని సమాచారం. దీంతో అప్పుడు ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయోనని సస్పెన్స్ కొనసాగుతోంది.

సాయంత్రం కొందరు బడాబాబుల పేర్లు
సాయంత్రానికి కొందరు బడాబాబుల పేర్లు బయటకు వస్తాయని వార్తలు వస్తుండటంతో డ్రగ్స్ తీసుకునే వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ పేర్లు బయటకు వస్తాయోనని పలువురిలో ఆందోళన ఉందని అంటున్నారు. సాయంత్రం పలువురు సినీ ప్రముఖులతో పాట పారిశ్రామికవేత్తల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశముందని అంటున్నారు.

రేపు పేర్లు వెల్లడి
ఇదిలా ఉండగా, నోటీసులు రాని వారి పేర్లు కూడా వస్తున్నాయని, అలా చేయవద్దని సినీ ప్రముఖులు చెబుతున్నారు. నోటీసులు ఎవరెవరికి వచ్చాయో రేపు ప్రెస్ మీట్ పెట్టి చెబుతామని మా అధ్యక్షులు శివాజీ రాజా చెప్పారు. అందరి పేర్లు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

డ్రగ్ లింక్‌లో మరొకరి అరెస్ట్
మరోవైపు, డ్రగ్ కేసులో పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు పీయూష్ అనే విద్యార్థిని అరెస్టు చేసారు. ఇదిలా ఉండగా, ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ శనివారం (రేపటి) నుంచి పది రోజుల పాటు సెలవులపై వెళ్తున్నారు.
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications