టాలీవుడ్ పోర్చుగల్ టూర్స్ వెనుక సీక్రెట్ ఇదేనా?: డ్రగ్స్ కేసులో సిట్ చేతికి కీలక ఆధారాలు..
పోర్చుగల్ లో డ్రగ్స్ తీసుకోవడం చట్టబద్దం కావడంతో.. ఇక్కడి నుంచే వారు డ్రగ్స్ తీసుకొస్తున్నారా?.. అందుకే తరుచుగా అక్కడికి వెళ్తున్నారా?.. అన్న కోణంలో వారి దర్యాప్తు కొనసాగుతోంది.
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసును సిట్ అధికారులు అంత ఈజీగా వదిలేలా లేరు. సీఎం నుంచి సైతం స్ట్రిక్ట్ ఆర్డర్స్ రావడంతో కేసును క్షుణ్ణంగా విచారిస్తున్నారు. కేసు గుట్టు విప్పే ఏ చిన్న క్లూని కూడా వారు వదిలిపెట్టట్లేదు. సెలబ్రిటీల నుంచి వివరాలు రాబట్టే విషయంలోను ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
అందుకే గంటల తరబడి వారిని విచారిస్తున్నారు. తొలుత తమకేమి తెలియదంటున్న సెలబ్రిటీలు.. సాక్ష్యాధారాలు చూపించగానే తెల్లముఖం వేస్తున్నారు. తీవ్ర ఒత్తిడికి లోనై నిజాలు బయటకు కక్కేస్తున్నారు. సిట్ విచారణ వారికి ఊపిరి సలపనివ్వడం లేదన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.

కాగా, పక్కా ఆధారాలు సంపాదించిన తర్వాతే సినీ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు జారీ అయినట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా వారి కదలికలకు సంబంధించిన ప్రతీ ఫోటో, వీడియోను వారు సంపాదించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఫేస్ బుక్, ట్విట్టర్, ఇతర మాద్యమాలలో ఉన్న వారి వివరాలన్నింటిని పోలీసులు సేకరించారు.
ముఖ్యంగా ఇటీవల 12మంది టాలీవుడ్ సెలబ్రిటీలు కలిసి వెళ్లిన పోర్చుగల్ టూర్ పై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పోర్చుగల్ లో డ్రగ్స్ తీసుకోవడం చట్టబద్దం కావడంతో.. ఇక్కడి నుంచే వారు డ్రగ్స్ తీసుకొస్తున్నారా?.. అందుకే తరుచుగా అక్కడికి వెళ్తున్నారా?.. అన్న కోణంలో వారి దర్యాప్తు కొనసాగుతోంది. పోర్చుగల్ లో డ్రగ్స్ కలిగి ఉండటాన్ని నేరంగా పరిగణించరు. ఆరోగ్య సమస్యల రీత్యా స్వల్ప మోతాదులో డ్రగ్స్ కలిగి ఉండటాన్ని అక్కడ అనుమతిస్తారు.
ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీల పోర్చుగల్ పర్యటనలపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలకు ఎవరెవరు వెళ్లారు?.. అక్కడేం చేశారు? వంటి ఆధారాలు ఇప్పుడు సిట్ చేతిలో ఉన్నట్లు సమాచారం. పూర్తి సాంకేతిక ఆధారాలను, కాల్ డేటాను సంపాదించిన తర్వాతే వారిని విచారణకు ఆహ్వానించినట్లు చెబుతున్నారు. విచారణలో సెలబ్రిటీల స్టేట్మెంట్స్ ను వీడియో రికార్డింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, దీనిపై స్పందించిన ఖాసిం భాషా అనే అడ్వకేట్..'విచారణలో సెలబ్రిటీల స్టేట్మెంట్స్ ను వీడియో రికార్డింగ్ చేసినంత మాత్రానా ఏ ఫలితం ఉండదు. కేవలం వీటినే సాక్ష్యాధారాలుగా కోర్టు ముందు పెట్టలేం' అని పేర్కొనడం గమనార్హం.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications