Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Drug mafia: నటి రాగిణి, సంజనాల వెంట్రుకలు వెనక్కి, హైదరాబాద్ ల్యాబ్ ఏం చెప్పింది ? ఏం జరిగింది ?

హైదరాబాద్/ బెంగళూరు: బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ డ్రగ్స్ దందా కేసుల్లో అధికారులు చాలా బిజీబిజీగా ఉన్నారు. డ్రగ్స్ దందా కేసులో అరెస్టు అయిన స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలతో పోలీసు అధికారులకు మరోసారి తలనొప్పి ఎదురైయ్యింది. డ్రగ్స్ సేవించారని, ఆ దందాతో లింక్ పెట్టుకున్నారని ఆరోపిస్తూ అరెస్టు అయ్యి సెంట్రల్ జైల్లో ఉన్న హీరోయిన్లు రాగిణి, సంజనాల తల వెంట్రుకలను హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షలు చేయించడానికి పంపించారు. హైదరాబాద్ ల్యాబ్ నుంచి రాగిణి, సంజనాల వెంట్రుకల శ్యాంపిల్స్ వెనక్కి రావడంతో పోలీసు అధికారులు ఆలోచనలో పడ్డారు.

 రాగిణి, సంజనాలకు వైద్యపరీక్షలు

రాగిణి, సంజనాలకు వైద్యపరీక్షలు

స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు దందాలో ప్రముఖ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నటి రాగిణి, సంజనాలకు పోలీసులు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. హీరోయిన్లు సంజనా, రాగిణిల రక్త పరీక్షలు, మూత్రపరీక్షలు, తల వెంట్రుకలను వైద్యులు సేకరించారు.

 హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షలు

హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షలు

నటి రాగిణి, బ్యూటీక్వీన్ సంజనాలు మేము డ్రగ్స్ సేవించలేదని, కావాలనే మమ్మల్ని కేసులో ఇరికించారని ఆరోపించారు. హీరోయిన్లు రాగిణి, సంజనాలు డ్రగ్స్ సేవించారని సాక్షాలు చిక్కడంతో వారిని అరెస్టు చేశామని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అన్నారు. హీరోయిన్లు సంజనా, రాగిణి తల వెంట్రుకలు సేకరించిన పోలీసులు వాటిని హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.

 రాగిణి, సంజనాల వెంట్రుకలు వెనక్కి

రాగిణి, సంజనాల వెంట్రుకలు వెనక్కి

హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో రాగిణి, సంజనాల తల వెంట్రుకలను అక్కడి నిపుణులు పరీక్షించారని తెలిసింది. అయితే ఏం జరిగిందో ? ఏమో ? హీరోయిన్లు రాగిణి, సంజనాల తల వెంట్రుకల శ్యాంపిల్స్ ను హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణలు వాటిని బెంగళూరుకు వాపస్ పంపిచారని వెలుగు చూసింది.

 టెక్నికల్ సమస్యలు !

టెక్నికల్ సమస్యలు !

హీరోయిన్లు రాగిణి, సంజనాల తల వెంట్రకులు సేకరించిన విధానం సక్రమంగా లేదని, వాటిని పరీక్షించడానికి సమస్యలు ఎదురౌతున్నాయని, ఈ వెంట్రుకలతో పరీక్షలు జరిపి వారు డ్రగ్స్ సేకరించారా ? లేదా ? అనే విషయం కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారని తెలిసింది.

Recommended Video

    COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
     అడిషనల్ పోలీసు కమిషనర్ పాటిల్ క్లారిటి

    అడిషనల్ పోలీసు కమిషనర్ పాటిల్ క్లారిటి

    చిన్న సాంకేతిక లోపాల కారణంగా హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీల తల వెంట్రుకలు వెనక్కి వచ్చాయని, ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోవడానికి చర్యలు తీసుకుంటున్నామని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ అడిషనల్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ వివరణ ఇచ్చారు. రాగిణి, సంజనాల తల వెంట్రకులు వెనక్కి తిరిగిరావడంతో మరోసారి వారి తల వెంట్రుకలు సేకరించి హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలని పోలీసు అధికారులు సిద్దం అవుతున్నారని తెలిసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+