డ్రగ్ డాన్ మైక్ కమింగ.. హైదరాబాద్ అల్లుడే?: పాతబస్తీ యువతితో వివాహం..
పాతబస్తీకి చెందిన ఓ యువతిని వివాహం చేసుకుని నానక్‌రాంగూడలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఆమెతో కాపురం చేస్తున్నట్లు వెల్లడైంది.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో పట్టుబడి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న మాఫియా డాన్ మైక్ కమింగ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఏడేళ్లుగా రాష్ట్ర రాజధానిలో డ్రగ్స్ విక్రయిస్తున్న కమింగ హైదరాబాద్ అల్లుడేనని సిట్ విచారణలో తేలింది.
పాతబస్తీకి చెందిన ఓ యువతిని వివాహం చేసుకుని నానక్‌రాంగూడలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఆమెతో కాపురం చేస్తున్నట్లు వెల్లడైంది. వీరికి మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నారని గుర్తించారు. నెదర్లాండ్స్ కు చెందిన మైక్ కమింగను డ్రగ్స్ కేసులో భాగంగా జులై 25వ తేదీ రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

శుక్రవారం కోర్టు అనుమతితో కమింగను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నెదర్లాండ్స్ నుంచి ఖరీదైన డీఎంటీ డ్రగ్(డీమీథైల్ ట్రైప్టమైన్)ను ఇక్కడి కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ నిపుణులకు కమింగ విక్రయించేవాడని నిర్దారించారు.
ఇటీవల కమింగ ఎక్సెజ్ అధికారులకు పట్టుపడిన సమయంలోను.. అతని వద్ద 2.6 గ్రాముల డీఎంటీ లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్ అత్యంత ఖరీదైనదని, ఒక్కో యూనిట్ రూ.4 వేల నుంచి 5 వేల వరకు ఉంటుందని చెబుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications