రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ; భారీగా డ్రగ్స్ సీజ్.. పట్టుబడిన బీజేపీనేత కుమారుడు!!
హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ వీడడం లేదు. డ్రగ్స్ ను నివారించడం కోసం ఎన్ని చర్యలు చేపట్టినా మళ్లీ మళ్లీ ఎక్కడో ఒకచోట భారీగా డ్రగ్స్ పట్టు పడుతూనే ఉన్నాయి. ఇక్కడ డ్రగ్స్ దందాలో బడా నాయకులు, సినీ సెలబ్రిటీలు పట్టుబడుతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.
నగరంలోని గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో నిర్వహించిన సోదాలలో పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని పక్కా ఇన్ఫర్మేషన్ తో పోలీసులు దాడి చేశారు. వారిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటుగా ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారు. వీరంతా పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకుని పార్టీ చేసుకుంటున్నట్టు అక్కడ దాడి చేసిన పోలీసులు గుర్తించారు.

గత మూడు రోజులుగా వీరు రాడిసన్ హోటల్ లో ఉంటూ డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారని, డ్రగ్స్ తో పాటు అక్కడ మద్యం కూడా ఏరులై పారుతుంది అని తెలుసుకున్న పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.
2009లో శేరిలింగంపల్లి నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన యోగానంద కుమారుడు వివేకానంద డ్రగ్స్ తీసుకుని పట్టుబడి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఇక గత మూడు రోజులుగా వీరంతా డ్రెస్ తీసుకుంటున్న హోటల్ కూడా బిజెపి నేత యోగానంద్ దే కావడం గమనార్హం.
అయితే పట్టుబడిన వీరిని విచారిస్తున్న పోలీసులు ఈ డ్రగ్స్ ఎక్కడినుంచి తీసుకువచ్చారు? వీరికి ఈ డ్రగ్స్ ను ఎవరు విక్రయించారు? ఇంకా ఈ డ్రగ్స్ దందాలో ఎవరెవరు ఉన్నారు? వంటి అనేక కోణాలలో వీరిని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications