అది తెలియదన్న చార్మీ, లంచ్‌లో 'ప్రత్యేకం': రేపు ముమైత్ వంతు
డ్రగ్స్ విచారణ కేసులో సినీ నటి చార్మి హైకోర్టుకు వెళ్లిన ఫలితం కనిపించిందా? అంత కానప్పటికీ ఎంతో కొంత కనిపించిందని చెబుతున్నారు.
హైదరాబాద్: డ్రగ్స్ విచారణ కేసులో సినీ నటి చార్మి హైకోర్టుకు వెళ్లిన ఫలితం కనిపించిందా? అంత కానప్పటికీ ఎంతో కొంత కనిపించిందని చెబుతున్నారు.
అమెను నలుగురు కూడా మహిళా అధికారులు ప్రశ్నించడం, ఉదయం నుంచి సాయంత్రం హైకోర్టు ఆదేశించిన సమయం వరకు ప్రశ్నించడం మాత్రమే ఆమెకు లభించిన ఊరట అంటున్నారు.

లంచ్‌లో చార్మి
హైకోర్టు ఆదేశాలు లేకపోయినా అధికారులు ఆమెను ఇలాగే విచారించే వారనే వాదనలు కూడా లేకపోలేదు. చార్మీ లంచ్ సమయంలో సిట్ అధికారులు ఇచ్చిన భోజనం తీసుకోలేదని తెలుస్తోంది. తాను తెప్పించుకున్న ఫ్రైడ్ రైస్, కర్డ్ రైస్, జ్యూస్ తాగారని సమాచారం. తన ఫుడ్ ఆమె ప్రత్యేకంగా తెప్పించుకున్నారని సమాచారం.

పబ్బుల్లో డ్రగ్స్.. తెలియదన్న చార్మీ
చార్మీని సిట్ అధికారులు ప్రధానంగా కెల్విన్ డాటా ఆధారంగా విచారణ జరిపారని తెలుస్తోంది. పబ్బుల్లో డ్రగ్స్ గురించి తెలుసా అంటే తనకు తెలియదని చార్మీ సమాధానం చెప్పారని తెలుస్తోంది. వీకెండ్‌లో పబ్బులకు వెళ్లడం, కెల్విన్‌తో వాట్సాప్ సమాచారంపై వారు ఆరా తీసారు. చార్మీని ఆరు గంటల పాటు ప్రశ్నించారు.

రెండుసార్లు అభివాదం చేస్తూనే..
చార్మీ సిట్ కార్యాలయంలోకి వెళ్లే ముందు, విచారణ అనంతరం సిట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చే సమయంలోను అభివాదం చేస్తూ వెళ్లారు. ఉదయం కాస్త వంగి మీడియాకు, అందరికీ నమస్కరించి లోనికి వెళ్లారు. సాయంత్రం వెళ్లే ముందు చేయి ఊపుకుంటూ వెళ్లిపోయారు. కాగా, చార్మీ ఇచ్చిన సమాచారంతో కొందరికి నోటీసులు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

గురువారం ముమైత్ ఖాన్
సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌కు పేరుగాంచిన ముమైత్ ఖాన్ గురువారం సిట్ ఎదుట హాజరు కానుంది. ఇందుకోసం ఆమె ఇప్పటికే హైదరాబాదుకు బయలుదేరారు. రేపు ఉదయం ఆమె సిట్ ఎదుట హాజరవుతారు. చార్మీలాగే ముమైత్‌ను కూడా నలుగురు సభ్యుల మహిళా ఆఫీసర్లు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నిస్తారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications