టాలీవుడ్‌లో ప్రకంపనలు: ముగ్గురు హీరోలు సహా 10మందికి నోటీసులు

టాలీవుడ్‌లో డ్రగ్ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి.ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, ఒక ఫైట్ మాస్టర్‌కు.. అధికారులు నోటీసులు ఇచ్చారు.

హైదరాబాద్: టాలీవుడ్‌లో డ్రగ్ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, ఒక ఫైట్ మాస్టర్‌కు.. మొత్తం పదిమందికి అధికారులు నోటీసులు ఇచ్చారు.

ఆ కారణంతోనే, చిట్టా ఉంది: ఆ 15మంది నటీనటులకు అల్లు అరవింద్ హెచ్చరిక

ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ అంశంపై దృష్టి సారించింది. కెల్విన్, బెన్, నిఖిల్ షెట్టీలు సినిమా పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారి నుంచి సమాచారం రాబట్టి.. పలువురికి నోటీసులు జారీ చేశారు.

Drug Racket Case: Excise issue notices to 10 tollywood personalities

ఆ రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలని, లేదంటే చర్యలు ఉంటాయని నోటీసుల్లో పేర్కొన్నారని తెలుస్తోంది. ముగ్గురు హీరోలు అందుబాటులో లేకపోవడంతో వారికి సంబంధించిన వారి ద్వారా నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.

వీరి తర్వాత మరో ఇరవై మందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఆ ఇరవై మంది కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. మొత్తానికి డ్రగ్స్ అంశం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది.

కెల్విన్, బెన్, నిఖిల్ షెట్టిలు ఎల్ఎస్‌డి, కొకైన్ వంటి డ్రగ్స్‌ను సినీ పరిశ్రమలోని వారికి సరఫరా చేసినట్లు గుర్తించారు.

ఇదిలా ఉండగా, నోటీసులు అందుకున్న ఆ పదిమంది సినీ ప్రముఖులు ఎవరు, వారిని అదుపులోకి తీసుకంటారా లేక కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తారా అనే చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+