డ్రగ్స్ కేసు: పేర్లు బయటకు రాని 15 మంది సినీ ప్రముఖుల గురించిన క్లూస్ ఇవిగో..!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో లింక్ ఉన్న సినీ ప్రముఖుల సంఖ్య 27 అయితే.. ఇప్పటి వరకు వారిలో 12 మందికే నోటీసులు జారీ చేసింది ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్.

మిగిలిన 15 మంది ప్రముఖుల పేర్లు మాత్రం బయటికి పొక్కలేదు. అయితే వీరికి సంబంధించి కొన్ని క్లూలు మాత్రం లీకయ్యాయి. వాటిని బట్టి నోటీసులు అందని మిగిలిన ఆ సినీ ప్రముఖులు ఎవరన్నదానిపై అంచనాలు వేస్తున్నారు పలువురు.

డ్రగ్స్.. డ్రగ్స్: అయ్యో.. వీళ్లకేమైంది? పూరీ వర్గాన్నే టార్గెట్ చేశారా?

ఓ ప్రముఖ నిర్మాత ఇద్దరు కుమారులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో వీరి కుటుంబం అత్యంత కీలకమైనది. ఈ కుటుంబంలోని అందరూ సినీ పరిశ్రమలో ఉన్నారు. గతంలో కూడా డ్రగ్స్ కేసుల్లో ఈ నిర్మాత కుమారుల పేర్లు వినిపించాయి.

Drugs Case: Some Clues of More 15 Cine Personalities whose names not came into limelight

ఇక మరో వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఓ క్రేజీ స్టార్ తో అనుకోకుండా ఓ హిట్ సినిమాను కూడా ఈయన నిర్మించారు. ఇంకొకరు.. చిన్న కథలు, కుటుంబ కథనాలతో భారీ హిట్లు కొట్టిన నిర్మాతట. ఓ కుర్ర హీరోతో.. సొంత బ్యానర్ తో ఈయన చిత్ర పరిశ్రమలోకి దూసుకొచ్చాడు.

2009లో టాలీవుడ్ లో అడుగుపెట్టి కుర్ర హీరోలతో వరుస హిట్లు కొట్టిన ఓ హీరోయిన్.. ప్రస్తుతం బాలీవుడ్ కు చెక్కేసిన ఈ నటి పేరు కూడా నోటీసులు అందని వారి జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక 2011, 2012లో ప్రముఖ హీరోలతో నటించి, హిట్లు కొట్టి, ఆ తరువాత ఫ్లాప్ హీరోయిన్లుగా ముద్రపడిన ఇద్దరు భామలు కూడా జాబితాలో ఉన్నట్లు సమాచారం. అలాగే రవితేజ తమ్ముడితో పలుమార్లు పబ్ లు, పార్టీలకు వెళ్లిన ఓ సహాయ నటుడి పేరు కూడా ఉందంటున్నారు.

మరో వ్యక్తి.. ఓ ప్రముఖ హీరోకు మేనేజర్ గా పని చేసే నటుడు. ఇంకో విలక్షణ దర్శకుడు. మేకప్ మ్యాన్, డ్రైవర్ల పేరుతో సిమ్ కార్డులు తీసుకున్న ఈయన కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే వేగంగా సినిమాలు తీస్తాడనే పేరున్న ఓ దర్శకుడు కూడా జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఈయన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా కెల్విన్ తో టచ్ లో ఉన్నట్లు వినికిడి.

ఇక 2013 వరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా సినిమాలు చేసిన మరో వ్యక్తి ఈయన. ఆ తరువాత ఓ ప్రముఖ హీరోతో సినిమా కూడా తీసి సంచలనం సృష్టించాడు. ఈయన కూడా నోటీసులు ఇంకా అందని వారి జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు ఆయన ఫ్యామిలీ హీరో. ఆ తరువాత ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా సిద్ధమయ్యాడు. విలక్షణ నటుడిగా కూడా పేరు తెచ్చకున్నాడు. ఆయన మేనేజర్ ఫోన్ నంబర్ కెల్విన్ కాంటాక్ట్ లిస్టులో ఉన్నట్లు సమాచారం.

Tollywood drugs scandal : Tollywood Top Director, Heroes and 3 Heroines Names revealed

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to sources, there are more cine personalities in the drugs case, for them excise and enforcement directorate not yet sent the notices. According to police, total suspected members are in this case is 27, from this list only 12 cine personalities are received notices till now. But there are some clues leaked about the remaining 15 personalities whose names not come into lime light.
Please Wait while comments are loading...