డ్రగ్స్ : 11 కేసుల్లో చార్జ్ షీట్ సిద్ధం, ఫోరెన్సిక్ నివేదిక అందగానే కోర్టుకు: అకున్ సబర్వాల్
తాము విచారించిన డ్రగ్స్ దందాలో భాగంగా 11 కేసుల్లో చార్జ్ షీట్ లను సిద్ధం చేశామని, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రాగానే వీటిని కోర్టులో దాఖలు చేస్తామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ .
హైదరాబాద్: తాము విచారించిన డ్రగ్స్ దందాలో భాగంగా 11 కేసుల్లో చార్జ్ షీట్ లను సిద్ధం చేశామని, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రాగానే వీటిని కోర్టులో దాఖలు చేస్తామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు.
హైదరాబాద్ లోని ఇఫ్లూ యూనివర్శిటీలో 'డ్రగ్స్ ఫ్రీ నేషన్' పేరిట ఓ కార్యక్రమం జరుగగా, అకున్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో విచారణ ఆగిపోలేదని, పారదర్శకంగా ముందుకు సాగుతోందని వెల్లడించిన ఆయన, తమపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవని అన్నారు.

రక్త నమూనాలు తీసుకున్న సినీ ప్రముఖుల రిపోర్టులను పరిశీలించిన తరువాత వారిపై చర్యలుంటాయని తెలిపారు. డ్రగ్స్ గురించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే, నిర్భయంగా తమకు అందించాలని సూచించారు.
తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా నిలిపేందుకు యువతలో మరింత చైతన్యం కలిగేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామని అకున్ సబర్వాల్ వెల్లడించారు. అన్ని ప్రముఖ విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications