పూరి ఇంటిపై బార్&రెస్టారెంట్ సెటప్?: 'డ్రగ్స్' సాక్ష్యాలున్నాయంటూ చార్మికి సిట్ ప్రశ్నలు..

సినిమా డిస్కషన్స్ సందర్భంగా పూరీ డ్రగ్స్ తీసుకుంటారా?.. అంటూ ప్రశ్నించిన పోలీసులు.. కొన్ని సాక్ష్యాధారాలతో చార్మీని హడలెత్తించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: మహిళా అధికారుల సమక్షంలో హీరోయిన్ చార్మీని సిట్ అధికారులు విచారిస్తున్నారు. బుధవారం ఉదయం 10గం.కు ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతోంది. మధ్య మధ్యలో విచారణకు సంబంధించిన కొన్ని లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి.

ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్, కెల్విన్ లకు సంబంధించిన విషయాలను చార్మీ నుంచి రాబట్టడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళిని కూడా తయారుచేసుకున్నట్లు కనిపిస్తోంది. పూరి జగన్నాథ్ ఇంటిపై బార్&రెస్టారెంట్ తరహా రూములు ఉన్నాయా? అంటూ చార్మీని వారు ఆరా తీసినట్లు చెబుతున్నారు.

డ్రగ్స్ ఫెస్టివల్స్ నిజమేనా?

డ్రగ్స్ ఫెస్టివల్స్ నిజమేనా?

అలాగే.. ఇంట్లోనే పూరి డ్రగ్స్ తీసుకుంటారా?.. డ్రగ్స్ ఫెస్టివల్స్ జరుగుతాయన్న ప్రచారం నిజమేనా?.. జరిగితే ఎక్కడ జరుగుతాయి వంటి ప్రశ్నలు చార్మీకి సంధించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పంజాబ్ నుంచి మీవాళ్లెవరైనా డ్రగ్స్ సప్లయర్స్ ఉన్నారా? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం.

Recommended Video

    Kajal Aggarwal, Raashi Khanna And Lavanya Tripathi Names In Drugs Scandal
    మావద్ద ఆధారాలున్నాయి:

    మావద్ద ఆధారాలున్నాయి:

    సినిమా డిస్కషన్స్ సందర్భంగా పూరీ డ్రగ్స్ తీసుకుంటారా?.. అంటూ ప్రశ్నించిన పోలీసులు.. కొన్ని సాక్ష్యాధారాలతో చార్మీని హడలెత్తించినట్లు తెలుస్తోంది. పూరి నుంచి మీకు డ్రగ్స్ అందినట్లుగా మా వద్ద ఆధారాలున్నాయని కూడా సిట్ అధికారులు ప్రస్తావించినట్లు చెబుతున్నారు.

    విదేశాల్లో ఎక్కడికి?

    విదేశాల్లో ఎక్కడికి?

    ఇక విదేశీ టూర్స్ గురించి ప్రస్తావిస్తూ.. తరుచుగా ఎక్కడికి వెళ్తుంటారు?.. అక్కడ ఏం చేస్తుంటారు? వంటి ప్రశ్నలు చార్మీ ఎదుర్కొన్నట్లు లీకులు వస్తున్నాయి. వీకెండ్స్ లో పబ్బులకు వెళ్తారా? సినిమా ఈవెంట్స్ ముగిశాక ఏ తరహా పార్టీలు చేసుకుంటుంటారు? అని సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.

    కొత్తగా ఏం తేలుతుందో?

    కొత్తగా ఏం తేలుతుందో?

    హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5గం. వరకే సిట్ అధికారులు చార్మీని విచారించనున్నారు. ఒకవేళ విచారణ పట్ల అధికారులు సంతృప్తిగా లేకపోతే మరోమారు ఆమెను విచారణకు పిలిచే అవకాశముంది. విచారణ ముగిసిన తర్వాత.. దీనికి సంబంధించి ఎలాంటి విషయాలు బయటకొస్తాయో అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+