డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిన లేడీ డాక్టర్: పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు

హైదరాబాద్: ఆమె ఓ డాక్టర్. హైదరాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి నగర పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న ఆమె బ్రీత్ ఎనలైజర్‌కు సహకరించకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు.

వివరాల్లోకి వెళితే, బంజారా హిల్స్ రోడ్ నెంబర్. 1లో కారులో వెళుతున్న లేడీ డాక్టర్‌ అఖిలను పోలీసులు ఆపేశారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేసేందుకు యత్నించారు. అయితే ఆమె అందుకు ఒప్పుకోలేదు.

Drunk and drive: Lady Doctor troubles traffic Police at Jubilee hills

పలువురు పోలీసు ఉన్నతాధికారులు తనకు తెలుసంటూ ఫోన్ తీశారు. ఫోన్‌లో మాట్లాడుతూ బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించ లేదు. అయితే చివరకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు ఒప్పుకున్న ఆమె పోలీసుల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయింది.

పరిమితికి మించి మద్యం సేవించి ఉన్నారని పోలీసులు తేల్చారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. ఆమెతో పాటు తాగి వాహనం నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే 10 కార్లతోపాటు 7 బైకులను పోలీసులు ఈ సందర్భంగా సీజ్ చేశారు. నగరంలోని బంజారాహిల్స్ లో పోలీసులు శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట తనిఖీలు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+