'నా ఆటో ఇవ్వకపోతే పామును వదులుతా..' పోలీసులకు చుక్కలు చూపించాడు..!
మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ వీరంగం సృష్టించాడు. మద్యం సేవించి ఆటో నడిపిన కారణంగా ట్రాఫిక్ పోలీసులు అతని ఆటోను సీజ్ చేశారు. దాంతో రెచ్చిపోయిన ఆటో డ్రైవర్ ఆటోలో నుంచి పామును తీసుకొచ్చి పోలీసులను భయపెట్టాడు. ఆటో వదిలేయకుంటే పామును వదులుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్టలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ లోని చాంద్రాయనగుట్టలో షాకింగ్ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ వాహనాన్ని నడుపుతున్నట్లు గుర్తించారు. అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 150 రీడింగ్ వచ్చింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆటోను సీజ్ చేశారు.

దీంతో ఆ ఆటో డ్రైవర్ పోలీసులపై రెచ్చిపోయాడు. మద్యం మత్తులో పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆటో లోంచి పామును తీసి రచ్చ రచ్చ చేశాడు. నా ఆటో ఇవ్వకపోతే పామును వదులుతా అంటూ హల్ చల్ చేశాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు.. అతన్ని పట్టుకునేలోపే.. పాముతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Drunk Auto Driver Triggers Chaos at #Chandrayangutta by Threatening Cops with Snake
— BNN Channel (@Bavazir_network) January 4, 2026
Tension prevailed at the Chandrayangutta crossroads in #Hyderabad’s Old City on Friday during a routine drunk-driving enforcement drive, after an auto-rickshaw driver created chaos by threatening… pic.twitter.com/HGcsuVdcDE
ఇక ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ నగరం వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిన విషయం తెలిసిందే. నిబంధనలు ఉల్లంఘించి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో 2,731 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అలాగే నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఆరు రోజుల్లో రాష్ట్రంలో రూ.1,350 కోట్ల మద్యం విక్రయించినట్లు తాజా లెక్కల ద్వారా స్పష్టం అవుతోంది.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications