• search

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన నటుడు, ఏటీఎంకు వెళ్లి దుస్తులు మార్చుకున్న యువతి

By Srinivas
Subscribe to Oneindia Telugu
For hyderabad Updates
Allow Notification
For Daily Alerts
Keep youself updated with latest
hyderabad News

    హైదరాబాద్: పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అర్ధరాత్రి ఓ నటుడు దొరికిపోయాడు. మరో యువతి కూడా మద్యం మత్తులో ఉండి.. పోలీసులు కారు ఆపగానే చాకచక్యంగా వెంటనే కారు దిగి ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లి షర్ట్ మార్చుకుంది. తద్వారా ఆమె తప్పించుకుంది.

    పోలీసులు నిత్యం డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇందులో భాగంగా శనివారం అర్ధరాత్రి రాత్రి నిర్వహించిన తనిఖీల్లో పలువురిపై కేసులు నమోదు చేశారు. రోడ్డు నెంబర్ 10లో నిర్వహించిన తనిఖీలో ఉయ్యాలా జంపాలా ఫేమ్‌ కిరీటి దామరాజు మద్యం తాగి కారు నడుపుతుండగా పోలీసులు నిలువరించి, అతనికి శ్వాసపరీక్షలు చేశారు.

    Drunk and drive test: Girl changes shirt in ATM

    రక్తంలో ఆల్కహాల్‌ లెవెల్‌ 36గా రావడంతో కారును స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్ 45 ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ సిబ్బందికి మద్యం మత్తులో కారు నడుపుతున్న యువతి తప్పించుకుంది.

    పోలీసులు కారు ఆపారు. ఆమె వెంటనే కారు దిగి సమీపంలోని ఏటీఎం కేంద్రంలోకి వెళ్లి టీ షర్టు మార్చుకుంది. వేరేవాళ్లు కారు నడిపారంటూ బుకాయించింది. పోలీసులు నిర్ధారించలేక వదిలేశారు. పలువురు వాహనదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    మరిన్ని హైదరాబాద్ వార్తలుView All

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    English summary
    It is said that A drunken and drive girl changed shirt in ATM centre to avoid Police in Hyderabad.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more