Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భార్యతో గొడవపడి: పూటుగా తాగి సింహాల బోనులోకి దూకింది ఇతడే (ఫోటోలు)

హైదరాబాద్: ఇంటి దగ్గర భార్యతో గొడవ పడి.. జీవితంపై విరక్తి చెంది, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో ప్రబుద్ధుడు. అందుకోసం పూటుగా మద్యం సేవించి నేరుగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లోని సింహాల్ ఎన్ క్లోజర్‌లో దూకేశాడు. అనంతరం జూపార్క్‌లోని ఆఫ్రికన్ సింహంతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించాడు.

ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ జూ సిబ్బంది అప్రమత్తమై అతడి ప్రాణాలు కాపాడారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన ముకేశ్‌ (35) నగరంలోని ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్‌ పనుల్లో కూలీగా చేసేందుకు వచ్చాడు. అతడు ఆదివారం ఉదయం తన భార్యతో గొడవపడ్డాడు.

అయితే ఈ క్రమంలో ఆదివారం జూ‌పార్క్‌కుసందర్శనకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న అతడు సింహాన్ని డార్లింగ్ అంటూ పలుమార్లు పిలిచి... అకస్మాత్తుగా ఆఫ్రికన్‌ లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి దిగాడు. సింహానికి చుట్టూ నీటి కుంట ఉండటంతో అందులోకి దూకి ఈదడం ప్రారంభించాడు.

అక్కడే సంచరిస్తున్న ఒక ఆడ, ఒక మగ సింహాలను రెచ్చగొడుతూ 'హాయ్‌.. డార్లింగ్‌' అంటూ వాటితో కరచాలనం చేయడానికి ప్రయత్నిస్తూ కవ్వించాడు. తమ వైపే వస్తున్న వ్యక్తిని చూసిన రెండు సింహాలు ఒక్కసారిగా ముకేశ్‌ వద్దకు పరుగు తీశాయి. అయితే అక్కడ నీటి కుంట ఉండటంతో సింహాలు అతడి దగ్గరకు వచ్చేలోపే భద్రతా సిబ్బంది అతనిని తాడుతో లాగేశారు.

అప్రమత్తమైన జూ సిబ్బంది ముకేశ్‌ను కాపాడారు. వెంటనే సింహాలను లోనికి పంపించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం అతడిని అధికారులు బహదూర్‌పుర పోలీసులకు అప్పగించారు. అయితే మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని నిబంధనలకు విరుద్ధంగా జూపార్క్ సిబ్బంది లోనికి ఎలా అనుమతించారనే విమర్శలు వస్తున్నాయి.

 పూటుగా తాగి సింహాల బోనులోకి దూకాడు

పూటుగా తాగి సింహాల బోనులోకి దూకాడు

ఇంటి దగ్గర భార్యతో గొడవ పడి.. జీవితంపై విరక్తి చెంది, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో ప్రబుద్ధుడు. అందుకోసం పూటుగా మద్యం సేవించి నేరుగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లోని సింహాల్ ఎన్ క్లోజర్‌లో దూకేశాడు. అనంతరం జూపార్క్‌లోని ఆఫ్రికన్ సింహంతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించాడు.

 పూటుగా తాగి సింహాల బోనులోకి దూకాడు

పూటుగా తాగి సింహాల బోనులోకి దూకాడు

ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ జూ సిబ్బంది అప్రమత్తమై అతడి ప్రాణాలు కాపాడారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన ముకేశ్‌ (35) నగరంలోని ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్‌ పనుల్లో కూలీగా చేసేందుకు వచ్చాడు. అతడు ఆదివారం ఉదయం తన భార్యతో గొడవపడ్డాడు.

 పూటుగా తాగి సింహాల బోనులోకి దూకాడు

పూటుగా తాగి సింహాల బోనులోకి దూకాడు

అయితే ఈ క్రమంలో ఆదివారం జూ‌పార్క్‌కుసందర్శనకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న అతడు సింహాన్ని డార్లింగ్ అంటూ పలుమార్లు పిలిచి... అకస్మాత్తుగా ఆఫ్రికన్‌ లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి దిగాడు. సింహానికి చుట్టూ నీటి కుంట ఉండటంతో అందులోకి దూకి ఈదడం ప్రారంభించాడు.

పూటుగా తాగి సింహాల బోనులోకి దూకాడు

పూటుగా తాగి సింహాల బోనులోకి దూకాడు

అక్కడే సంచరిస్తున్న ఒక ఆడ, ఒక మగ సింహాలను రెచ్చగొడుతూ ‘హాయ్‌.. డార్లింగ్‌' అంటూ వాటితో కరచాలనం చేయడానికి ప్రయత్నిస్తూ కవ్వించాడు. తమ వైపే వస్తున్న వ్యక్తిని చూసిన రెండు సింహాలు ఒక్కసారిగా ముకేశ్‌ వద్దకు పరుగు తీశాయి. అయితే అక్కడ నీటి కుంట ఉండటంతో సింహాలు అతడి దగ్గరకు వచ్చేలోపే భద్రతా సిబ్బంది అతనిని తాడుతో లాగేశారు.

పూటుగా తాగి సింహాల బోనులోకి దూకాడు

పూటుగా తాగి సింహాల బోనులోకి దూకాడు

అప్రమత్తమైన జూ సిబ్బంది ముకేశ్‌ను కాపాడారు. వెంటనే సింహాలను లోనికి పంపించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం అతడిని అధికారులు బహదూర్‌పుర పోలీసులకు అప్పగించారు. అయితే మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని నిబంధనలకు విరుద్ధంగా జూపార్క్ సిబ్బంది లోనికి ఎలా అనుమతించారనే విమర్శలు వస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+