వైరల్ వీడియో: పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు..

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోలీసులు బుధవారం రాత్రి విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఓ యువకుడు చుక్కలు చూపించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఒక యువకుడు పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా మద్యం మత్తులో వింత వింతగా ప్రవర్తించసాగాడు. తన బైక్‌ ను తిరిగి ఇవ్వాలని పోలీసులతో గొడవపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.

Drunk Youth Creates Chaos Gives Nampally Police a Hard Time During New Year Checks

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ లో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వింత వింత ఘటనలు జరిగాయి. పోలీసులకు మందు బాబులు భారీగా పట్టుబడ్డారు. ఈ మేరకు మద్యం సేవించి వాహనాలు నడిపిన 2,731 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఓ యువకుడు చుక్కలు చూపించాడు. తన బైక్ తనకు ఇప్పించాలని తలను గోడకేసి కొట్టుకున్నాడు. అంతేకాక పోలీసులతో దౌర్జన్యానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

తన బైక్ తనకు ఇప్పించాలని లేకపోతే తనకు కోపం వస్తోందని పోలీసులతో ఆ యువకుడు గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఒక పోలీసు అధికారి కాళ్లపై పడ్డాడు. ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు అతడ్ని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా ఆ యువకుడు వారిని ఇబ్బంది పెట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+