కాంగ్రెసుకు డిఎస్ రాజీనామా, షాక్ తిన్న నేతలు: కెసిఆర్‌తో భేటీ

హైదరాబాద్: సీనియర్ నేత డి. శ్రీనివాస్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బుధవారం నాడు కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ఆయన కెసిఆర్‌ను కలిశారు.

డిఎస్‌ను నిలువరించేందుకు కాంగ్రెసు తెలంగాణ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెసు నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వి. హనుమంతరావు, డికె అరుణ డిఎస్ నివాసానికి వచ్చి వెనుదిరిగారు. ఆయన తమను కలవకపోవడంతో ఫోన్ చేశారు. అయితే, డిఎస్ కాకుండా వేరే వ్యక్తి వారి కాల్‌కు బదులిచ్చారు.

DS quits Congress, meets KCR in camp office

కెసిఆర్‌తో భేటీ ముగిసిన తర్వాత ఆయన కాంగ్రెసుకు తాను రాజీనామా చేసే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెసు అధిష్టానం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌పై ఆయన ఇటీవల బహిరంగంగానే విమర్శలు చేశారు.

టీఆర్ఎస్‌లో డిఎస్ చేరికతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు తీవ్రంగా మారనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఆయనకు సొంత క్యాడర్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెసుపై ఆయన రాజీనామా ప్రభావం పడే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+