అన్నీ చెప్పను, కేసీఆర్ నుంచి సమాధానం రావాలి: కాంగ్రెస్‌లో చేరికపై డీఎస్
నిజామాబాద్: జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, అనుచరులతో రాజ్యసభ సభ్యులు డీ శ్రీనివాస్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన భవిష్యత్తు నిర్ణయంపై అన్నింటిని అప్పుడే మీడియాకు అన్ని చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తాను తీసుకునే నిర్ణయం వ్యక్తిగతం అన్నారు.
పార్టీ మార్పుపై వస్తున్న వార్తలు ఊహాగానాలే అన్నారు. తనకు తెరాస అధిష్టానం నుంచి సమాధానం రావాలన్నారు. తనపై తెరాస నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందించనని చెప్పారు. కాగా, అంతకుముందు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది.

తెరాసపై అసంతృప్తిగా ఉన్న డీఎస్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు వచ్చాయి. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని ప్రచారం సాగింది. తెరాసలో తనకు తగిన గౌరవం దక్కకపోవడంతో బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని డీఎస్ సహచరులతో చెప్పారని అంటున్నారు.
కాంగ్రెస్‌లో చేరేందుకు ఆ పార్టీ ముఖ్య నేత గులాం నబీ ఆజాద్ జరిపిన చర్చలు ఫలించాయనీ, దీనికి కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపిందని కూడా వార్తలు వచ్చాయి. ఈ నెల 11న సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని, ఆయనత ోపాటు తో పాటు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. దీనిపై డీఎస్ వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications