Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు..
శనివారం సాయంత్రం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిస్తున్నాయి. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం, పశ్చిమ బంగాళాఖాతంలో వచ్చే 48 అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నిర్మల్, ఆదిలాబాద్, కుమురభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జనగాం, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షలు కురిశాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వర్షాలతో చెరువులు నిండిపోయాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇందల్వాయి, డిచ్ పల్లి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్ పల్లిలో భారీగా వర్షం పడింది. గన్నారంలో 14 సెంటీమీటర్లు, చీమనుపల్లిలో 12 సెంటీమీటర్లు, జక్రాన్ పల్లిలిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, రుద్రారం, పిట్లంలో వాన దంచికొట్టింది. భారీ వర్షాలతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో జిల్లా విద్యా శాఖ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. లోకల్ హాలిడే గా నిర్ణయించారు. వచ్చే రెండు రోజుల్లో నిర్మల్, మెదక్, సంగారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, అదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు హైదరాబాద్ లో సోమవారం ఉదయం నుంచి వర్షం కురిస్తుంది. ఉదయం నమ్మెదిగా మొదలైన వాన తర్వాత దంచికొట్టింది. తర్వాత తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిరు జల్లులు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications