హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దసరా సంబరం: దుర్గామాత ఊరేగింపు(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరవాసులు దసరా సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. గత తొమ్మిది రోజులుగా అమ్మవారికి నవరాత్రుల్లో వివిధ రూపాలతో అలంకరించిన భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆదివారం అర్ధరాత్రి వరకు హుస్సేన్‌ సాగర్‌లో దుర్గామాతా విగ్రహాల నిమజ్జనాలు కొనసాగాయి. 8 క్రేన్లు ఎన్టీఆర్‌ మార్గంలో నిమజ్జనాల కోసం ఉంచగా చాలా విగ్రహాలు అర్ధరాత్రి అనంతరం వరకు రావడంతో నిమజ్జనం ఆలస్యమైంది.

ఆదివారం ఉదయం పోలీసులు మిగిలిపోయిన వందలాది విగ్రహాలను నెక్లెస్‌రోడ్‌లో పీవీ ఘాట్‌ వరకు క్యూలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. దీంతో జలవిహార్‌లో జరిగిన అలయ్‌బలయ్‌ కార్యక్రమానికి కొంత మేరకు ఆటంకం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం వరకు అధికారికంగా 2,500 విగ్రహాలు నిమజ్జనమయినట్లు పోలీసులు తెలిపారు.

భారీ విగ్రహం ఘన నిమజ్జనం

దసరా శరన్నవరాత్రులలో అతి పెద్ద విగ్రహంగా గుర్తించబడిన ఇసామియాబజార్‌లోని శాంతి, రౌద్ర, ఉగ్రరూప దుర్గామాత అమ్మవారి విగ్రహాన్ని ఘనంగా నిమజ్జనం చేశారు. ఆదివారం కన్నుల పండువగా సాగిన శోభాయాత్రలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Durga Mata immersion in Hyderabad

ఇసామియా బజార్‌లోని టెలివిజన్‌ హోటల్‌ పక్క వీధిలో 50 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేసిన ఈ విగ్రహం రాష్ట్రంలోనే అతిపెద్దదిగా గుర్తించబడింది. శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా ఉత్సవ సమితి నిర్వాహకుడు గులాబ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తొమ్మిది రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు.

English summary
Durga Mata immersion is being celebrated in Hyderabad on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X