మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకం అమల్లోకి..!

మహిళల సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తోంది. అయితే తాజాగా తెలంగాణలోని మహిళల అభ్యున్నతికి మరో కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురానుంది. ఇప్పటివరకు సభ్యులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. బ్యాంకు నుంచి అప్పు తీసుకుని మెంబర్ చనిపోతే దాన్ని సంబంధిత కుటుంబ సభ్యులు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు బాధిత కుటుంబాలపై ఆ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళల రుణానికి బీమా స్కీమ్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తాజా నిర్ణయంతో రుణం తీసుకున్నవారు మరణిస్తే ప్రభుత్వమే బ్యాంకునకు చెల్లిస్తుంది. ఆ సభ్యురాలికి రూ. 10 లక్షలు బీమా కూడా ఉంటుంది. అయితే ఈ బీమా నగదును కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది.

DWACRA Women Rejoice Telangana Government Rolls Out New Scheme Enhanced Support amp amp Financial Aid

ఇక రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు పెట్రోల్ బంకుల్లో ఉపాధిని కల్పించి ఆర్థిక భరోసాను అందిస్తోంది. అయితే ఈ పథకం కింద అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో మహిళలతో పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో సంబంధిత జిల్లా మహిళా సమాఖ్య కనీసం.. ఒక పెట్రోల్ పంపు ఏర్పాటు చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+