కోడ్ ఉల్లంఘనలు: కెసిఆర్, కెటిఆర్‌కు ఈసీ నోటీసులు
హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కెటి రామారావులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమై హామీలు ఇవ్వడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది.
అలాగే సచివాలయంలో మంత్రి కెటి రామారావు కొందరు నేతలకు కండువాలు కప్పడాన్ని కూడా ఎన్నికల సంఘం తప్పుబట్టింది. దీనిపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఇరువురిని ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కె. శివకుమార్ నాయుడును జిహెచ్ఎంసి అదనపు కమిషనర్‌గా ప్రభుత్వం నిమించింది.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా కృష్ణ భాస్కర్, మెదక్ జిల్లా పరిషత్ సీఈవోగా అలుగు వర్షిణి, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా అద్వైత్ కుమార్‌సింగ్, జగిత్యాల సబ్ కలెక్టర్‌గా శశాంక, వికారబాద్ సబ్ కలెక్టర్‌గా శృతి ఓజాను నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.












Click it and Unblock the Notifications