ఎన్నికల్లో సరికొత్త పంథా.. టెక్నాలజీ వాడేస్తున్న ఈసీ

తెలంగాణ ఎన్నికలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ టీమ్ కు ఈసారి ఎన్నికల్లో ఎలా ఉండబోతోంది అనేది చర్చానీయాంశంగా మారింది. దేశంలో ఐదుచోట్ల ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలంగాణ ఎలక్షన్లపైనే ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఆయా పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో ముందుకెళుతున్నాయి. సైద్దాంతిక విభేదాలు సైతం పక్కనబెట్టి ఒక్కటైన టీడీపీ, కాంగ్రెస్ తీరుతో ఇక్కడి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. అటు బీజేపీ తీరు బయటపడకున్నా తనదైన స్ట్రాటజీతో ఎన్నికలకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికలను ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మాల్ ప్రాక్టీస్ కు ఛాన్స్ ఉండొచ్చని ఈసీ భావిస్తున్నట్లు సమాచారం.

ఎన్నికల సందర్భంగా వివిధ అంశాలకు సంబంధించి నేరుగా తమకు ఫిర్యాదు చేసే విధంగా యాప్ ను ఆవిష్కరించింది ఎన్నికల సంఘం. ఎన్నికలకు సంబంధించిన గొడవలైనా, అసాంఘిక కార్యకలాపాలైనా, పోలింగ్ సెంటర్ల దగ్గర జరిగే మాల్ ప్రాక్టీస్ ఐనా ఈ యాప్ ద్వారా ఈసీకి కంప్లైంట్ ఇవ్వొచ్చు. అంతేకాదు దివ్యాంగులైన ఓటర్లకు, పోటీచేసే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా మరో రెండు యాప్ లు కూడా సిద్ధమయ్యాయి.

ఫిర్యాదుల కోసం

ఫిర్యాదుల కోసం "సి-విజిల్" యాప్ C-Vigil

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా యాప్ రూపొందించింది ఈసీ. సి-విజిల్ (సిటిజన్ విజిల్) పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా ఎలక్షన్ల మాల్ ప్రాక్టీస్ కు సంబంధించి దొంగ ఓట్లు వేయడం దగ్గర్నుంచి ఎలాంటి ఫిర్యాదులైనా ఇవ్వొచ్చు. ఈ యాప్ లో చాలా రకాల ఫీచర్లు ఉన్నాయి. ఫిర్యాదులను మేసేజ్ రూపంలోనే గాకుండా ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేయొచ్చు. తమ ఫిర్యాదులకు సాక్ష్యంగా ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయొచ్చు. అంతేగాకుండా తమ ఫిర్యాదులు ఈసీకి చేరాయా లేదా.. చర్యలు ఏమైనా తీసుకుందా లాంటి వివరాలు ఆన్ లైన్ లో చెక్ చేసుకునే వీలుంది.

దివ్యాంగుల కోసం

దివ్యాంగుల కోసం "వాడ" VAADA

దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా వాడ యాప్ ను ప్రారంభించింది ఎన్నికల సంఘం. ఓటర్ యాక్సెసిబిలిటీ అప్లికేషన్ ఫర్ ఢిఫరెంట్లీ ఏబుల్డ్ - వాడ పేరుతో పిలిచే ఈ యాప్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వరకే పరిమితం కానుంది. 15 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వివరాలు ఈ యాప్ లో పొందుపరిచారు. జీహెచ్ఎంసీ-జీఐఎస్ సెల్స్ రూపొందించిన జియో రిఫరెన్స్‌డ్ జీఐఎస్ మ్యాప్‌లను ఇందులో క్రోడీకరించారు. జియో ట్యాగింగ్ ద్వారా దివ్యాంగ ఓటర్లు నమోదయి ఉన్న సంబంధింత పోలింగ్ కేంద్రాలకు మ్యాప్ చేశారు.

దివ్యాంగ ఓటర్లు వాడ యాప్ ద్వారా వివరాలు నమోదు చేసుకుంటే సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 20వేల మంది దివ్యాంగ ఓటర్లను అధికారులు గుర్తించారు. ఈ యాప్ ద్వారా దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా కసరత్తు ప్రారంభించారు.

 పోటీ చేసే అభ్యర్థులకు

పోటీ చేసే అభ్యర్థులకు "సువిధ"

ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ "సువిధ". పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాలకు సంబంధించిన సమావేశాలకు గానీ, ర్యాలీలకు గానీ అనుమతిలిచ్చే సింగిల్ విండో అన్నమాట ఈ యాప్. దీని ద్వారా అభ్యర్థులు ఎక్కడికి తిరగకుండా ఉన్నచోట నుంచే అనుమతులు నేరుగా పొందే వీలుంది. ఇది ప్రారంభించగానే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కు వందల సంఖ్యలో ఆప్లికేషన్స్ వచ్చినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+