జాగ్రత్తగా మాట్లాడండి: కొండా సురేఖకు ఎన్నికల సంఘం హెచ్చరిక

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. కొండా సురేఖ ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. అంతేగాక, ఎన్నికల కోడ్ ముగిసే వరకు జాగ్రత్తగా మాట్లాడాలని కొండా సురేఖను హెచ్చరించింది.

ఇతర పార్టీలను, నేతలు విమర్శించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఏప్రిల్ 1న వరంగల్‌లో మీడియా సమావేశంలో కేటీఆర్ ​ఫోన్‍ ట్యాపింగ్‍లతో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్‍ మెయిల్‍ చేశాడని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఎంతో మంది అధికారులను బలిచేసి వారు ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశారని కొండా సురేఖ అన్నారు.

EC Warning to Minister Konda Surekha comments on KTR

అధికారం లేకనే కేసీఆర్‌, కేటీఆర్‌ కొత్త డ్రామాలకు తెర తీశారని సురేఖ విమర్శించారు. ఇప్పటికే మీ సోదరి శ్రీకృష్ణ జన్మస్థానం వెళ్లారంటూ కవితనుద్దేశించి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు కొండా సురేఖ. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌పై చేసిన ఆరోపణలపై ఆ పార్టీ నేతలు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎన్నికల కమిషన్.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వారా నివేదిక తెప్పించుకుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను జిల్లా ఎన్నికల అధికారి ఇంగ్లీషులోకి అనువదించి పంపించారు.

ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను పరిశీలించిన ఎన్నికల ఆమెకు హెచ్చరికలు జారీ చేసింది. జైలుకు వెళ్లడం ఖాయమన్న భయంతోనే కేటీఆర్ మాట్లాడుతున్నారన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను కూడా ఈసీ పరిగణలోకి తీసుకుంది.

ఇలాంటి నిరాధార ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ, నేత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎన్నికల ప్రక్రియకు అంతరాయంగా ఉన్నాయని ఈసీ వ్యాఖ్యానించింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని.. ఇక ముందు జాగ్రత్తగా ఉండాలని మంత్రి కొండా సురేఖను ఈసీ హెచ్చరించింది. అయితే, తాజాగా, కూడా కేసీఆర్, కేటీఆర్ లపై కొండా సురేఖ విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ లు జైలుకెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+