తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా

K Keshava Rao: తెలంగాణలో మొన్నటికి మొన్న లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలను అధికార కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఎనిమిది చొప్పున పంచుకున్నాయి. మిగిలిన హైదరాబాద్ స్థానాన్ని అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నిలబెట్టుకుంది. భారత్ రాష్ట్ర సమితి ఖాతా కూడా తెరవలేకపోయిందా ఎన్నికల్లో.

ఇక తాజాగా మరోసారి ఎన్నిక నగారా మోగింది. రాజ్యసభ ఉప ఎన్నిక ఇవి. బీఆర్ఎస్‌ మాజీ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఈ ఎన్నిక అవసరమైంది. తన పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసిన కేకే.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కేశవరావు రాజ్యసభ పదవీ కాలం 2026 ఏప్రిల్ 9వ తేదీ వరకు ఉంది.

ECI releases schedule for the 12 vacant seats of Rajya Sabha including Telangana

తెలంగాణతో పాటు మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణతో పాటు అస్సాం, బిహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర, ఒడిషా ఉన్నాయి.

అస్సాం- కామాఖ్య ప్రసాద్ టాసా, సర్బానంద సొనొవాల్, బిహార్- మీసా భారతి, వివేక్ ఠాకూర్, హర్యానా- దీపేందర్ సింగ్ హుడా, మధ్యప్రదేశ్- జ్యోతిరాదిత్య సింధియా, మహారాష్ట్ర- ఉదయరాజె భోంస్లే, పియూష్ గోయెల్, కేసీ వేణుగోపాల్- రాజస్థాన్, తెలంగాణ- కే కేశవరావు, ఒడిశా- మమత మొహంతా పదవులు ఖాళీ అయ్యాయి.

కేశవరావు, మమత మొహంతా తమ పదవులకు రాజీనామా చేయడం వల్ల ఎన్నికలు అవసరం అయ్యాయి. మిగిలిన వారంతా కూడా మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆయా కారణాల వల్ల రాజ్యసభలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాల్సి వచ్చింది.

ఈ నెల 14వ తేదీన నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల 21 చివరి తేదీ. 22న నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపురల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ ఈ నెల 26. బిహార్, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశాల్లో చివరి తేదీ ఈ నెల 27.

సెప్టెంబర్ 3వ తేదీన పోలింగ్ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అదే రోజున సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కిస్తారు. 6వ తేదీ నాటికి ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని ఈసీ ఈ షెడ్యూల్‌లో వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+