మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారు: జగన్‌కు ఈడీ మరో భారీ షాక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈడీ మరో షాక్ ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసులో ఈడీ మరో ఛార్జీషీట్ దాఖలు చేసింది.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈడీ మరో షాక్ ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసులో ఈడీ మరో ఛార్జీషీట్ దాఖలు చేసింది.
పెన్నా సిమెంట్స్‌కు సంబంధించిన కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. జగన్‌తో పాటు వైసిపి నేత, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డి తదితరులపై నేరారోపణ చేసింది.

మనీ లాండరింగ్
పెన్నా సిమెంట్స్‌కు సంబంధించిన కేసులో ఈడీ ఇప్పటికే పెన్నా ప్రతాప్ రెడ్డి, జగన్ తదితరులపై కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ కేసులో దీనిని నమోదు చేశారు. దీనిపై ఈడీ తాజాగా ఛార్జీషీట్ దాఖలు చేసింది.

ప్రతాప్ రెడ్డికి అనుచిత లబ్ధి కల్పించారని...
వైయస్ జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెన్నా ప్రతాప రెడ్డికి సంబంధించిన కొన్ని సంస్థలకు అనుచిత లబ్ధి కల్పించారని, తద్వారా ప్రతాప్ రెడ్డి కోట్లాది రూపాయల లాభం పొందారని ఆరోపణలు ఉన్నాయి.

కర్నూలు, బంజారాహిల్స్‌లలో..
కర్నూలులోని 304 ఎకరాల్లోని గనులను పెన్నా ప్రతాప్ రెడ్డికి ఇచ్చారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్ నిర్మాణానికి సంబంధించి అనుమతులు ఇవ్వడంలో కూడా లబ్ధి కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి.

జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి..
ఈ మేరకు జగన్ కంపెనీల్లో పెన్నా ప్రతాప్ రెడ్డి పెట్టుబడులు పెట్టారనే విషయం నిర్ధారణ అయినట్లు ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. పెన్నా ప్రతాప్ రెడ్డి.. జగన్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే రూ.7.85 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

ఆస్తుల అటాచ్..
పెన్నా సిమెంట్స్ తదితర ఆస్తులపై ఈడీ అటాచ్‌మెంట్స్ కొనసాగుతున్నాయి. ఈ ఛార్జీషీటులో పెన్నా ప్రతాప్ రెడ్డి, వైయస్ జగన్, విజయ సాయి రెడ్డిల పేర్లను ప్రస్తావించారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications