Gangula Kamalakar: గంగులకు ఈడీ షాక్.. ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు..

కరీంనగర్ ఎమ్మెల్యే, పౌరసరఫరాల శాఖ మంత్రికి గంగుల కమలాకర్ కు ఈడీ షాక్ ఇచ్చంది. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు ఆరోపణలు రావడంతో ఆయన కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో కూడా గంగుల కమలాకర్ కంపెనీల్లో ఈడీ సోదాలు చేసింది. గంగుల కుటుంబ సభ్యులకు గ్రానైట్ కంపెనీలు ఉన్నాయి. శ్వాతా గ్రానైట్స్ పేరుతో ఏళ్లు గ్రానైట్ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. శ్వేత గ్రానేట్ అవకతవకలు జరిగాయని గతంలో ఈడీ గుర్తించింది. గత సంవత్సరం ఈడీ శ్వేతా కంపెనీలో సోదాలు కూడా చేసింది.

చైనాకు గ్రానైట్స్‌ మెటీరియల్ ఎగుమతి చేయటంలో అక్రమాలు జరిగినట్టు శ్వేత గ్రానైట్స్ పై ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ రిపోర్టు ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను అక్రమంగా తరలించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలిసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి గ్రాటైన్ ఎగుమతి చేసి రూ.4.8 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులో సుమారు రూ. 50 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా.. శ్వేత కంపెనీ కేవలం రూ. 3కోట్లు మాత్రమే చెల్లించిందని ఈడీ పేర్కొంది.. మరోవైపు హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయ్యినట్టు ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

ED notices to family members of Minister Gangula Kamalakar

గంగుల కమలాకర్ మరోసారి కరీంనగర్ నుంచి పోటీ చేయనున్నారు. సీఎం కేసీఆర్ గంగుల కమలాకర్ కు మరోసారి అవకాశం ఇచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు ఇవ్వడం స్థానికంగా చర్చనీయంశంగా మారింది. ఈ మధ్య గ్యాబ్ ఇచ్చిన ఈడీ తాజా నోటీసులు జారీ చేయడంతో పలువురు బీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర, పలువులు బీఆర్ఎస్ ఇళ్లలో ఈడీ, ఐటీ సోదాలు చేసింది. మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, విద్యాసంస్థల్లో కూడా ఐటీ సోదాలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+