క్రిస్మస్ సెలవులపై తాజా నిర్ణయం, పొడిగింపు..!!
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే క్రిస్మస్ కోసం సెలవులను ఖరారు చేసింది. అయితే, తాజాగా వీటి విషయంలో స్పష్టత ఇచ్చింది. వరుసగా మూడు రోజులు క్రిస్మస్ సెలవులు రానున్నాయి. దీంతో.. మూడు రోజుల పాటు పాఠశాలలకు.. రెండు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రానుంది. ఇక.. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ.. ఇప్పటికే 2026 లో ప్రభుత్వ కార్యాలయాలు.. పాఠశాలల అకడమిక్ ఇయర్ ను ప్రకటించారు.
క్రిస్మస్ సెలవుల పైన బిగ్ అప్డేట్. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ సెలవు ఇచ్చారు. కాగా.. ముందు రోజు డిసెంబర్ 24వ తేదీన క్రిస్మస్ ఈవ్‌కు కూడా సెలవు ప్రకటించారు. ఇక క్రిస్మస్ తర్వాతి రోజు డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా కూడా ఉద్యోగులు, విద్యార్థులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో వరుసగా మూడు రోజుల సెలవులు రానున్నాయి. తాజాగా .. తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 24న ఆప్షనల్ హాలీడే ప్రకటించింది. ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తెరిచే ఉంటాయి. అయితే సెలవు కావాల్సిన వాళ్లు ఆ రోజు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

కాగా, డిసెంబర్ 25న క్రిస్మస్ హాలీడే. ఇక తర్వాతి రోజు బాక్సింగ్ డే కావడంతో అధికారిక సెలవు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవుగా ఖరారు చేసారు. అటు ఏపీలో డిసెంబర్ 25న క్రిస్మస్ సెలవు ఉంటుంది. ఇక డిసెంబర్ 24, 26 రోజులను ఆప్షనల్ హాలీడేస్ జాబితాలో చేర్చింది. క్రిస్మస్ ఈవ్ నాడు అర్ధరాత్రి ప్రార్ధనలతో పండుగ మొదలవుతుంది. ఇక డిసెంబర్ 26న జరుపుకునే బాక్సింగ్ డేకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇక.. అటు కొత్త సంవత్సరం ప్రారంభం వేళ.. డిసెంబర్ నెలాఖరులో ఉన్న పండగుల కారణంగా ఇప్పటికే పలువురు తమ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఇక.. జనవరిలో సంక్రాంతి సెలవులను విద్యాశాఖ ఇప్పటికే ఖరారు చేసింది.












Click it and Unblock the Notifications