గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, మూడు విడతల్లో- అమల్లోకి కోడ్..!!
తెలంగాణలో మరో ఎన్నికల సమరం మొదలైంది. పల్లెపోరుకు ముహూర్తం ఫిక్స్ అయింది. కొంత కాలంగా పంచాయితీ ఎన్నికల పై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర పడింది. ఎన్నికల సంఘం ఈ ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసింది. మూడు విడతలుగా జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి ముందస్తు కసరత్తు పూర్తి చేసింది. రిజర్వేషన్ల పైనా స్పష్టత రావటంతో ఈ పంచాయితీ పోరు ఖరారు చేసింది. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూలు, నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రం విడుదల కానుంది. 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 గ్రామ పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. మూడు ఫేజ్‌లలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. దీంతో పంచాయతీరాజ్‌శాఖ, ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టాయి. సాయంత్రం 6గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించేలా నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌లో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేసింది.

పంచాయితీ పోరుకు సంబంధించి ఎన్నికల సిబ్బంది ఎంపిక, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. పాత రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు వెల్లడించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ఇప్పటికే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌కు నివేదికను సమర్పించింది. మంగళవారం జరిగే కేబినెట్ భేటీలో చర్చించి పంచాయతీ ఎన్నికల తేదీలను ఖరారు చేయాలని భావించారు. ఇప్పటికే మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రతిపాదనలు సమర్పించగా వాటిని తెలంగాణ ప్రభుత్వం పరిశీలించింది. డిసెంబర్ 11న తొలి విడత పోలింగ్ కు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే రోజు మధ్యాహ్నం తరువాత ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ వెంటనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరో రెండు విడతల పైనా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సాయంత్రం ఈ ఎన్నికల పైన ఎన్నికల సంఘం పూర్తి వివరాలు వెల్లడించనుంది.












Click it and Unblock the Notifications