ఓటరు లిస్టులో మీ పేరు ఉందా, లేదా - ఇలా చెక్ చేసుకోండి..!!
తెలంగాణలో అసెంబ్లీ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలలో ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతాయి. ఓటు వేసేందుకు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారు తమ సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు సంచలనం నమోదు చేయబోతోంది. ఓటర్లలోనూ ఉత్సుకత పెంచుతున్న వేళ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా. ఎలా చెక్ చేసుకోవాలి.
ఓటరు లిస్టులో పేరు:తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ పైన అంచనాలు పెరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్న ఓటర్ల తీర్పు ఏంటనేది ఆసక్తిగా మారుతోంది. ఇదే సమయంలో ఓటర్లు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందా..లేదా అనేది తెలుసుకొనేందుకు ఎన్నికల సంఘం వెసులుబాబు కల్పించింది. ఇప్పటికే అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం ఎపిక్ కార్డు ద్వారా నెంబర్ కేటాయించింది. ఈ నెంబర్ లేకపోతే మీ పేరు తోనూ జాబితాను లో సెర్చ్ చేసుకొనేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఎస్ఎంఎస్, రెండోది ఈసీ హెల్ప్‌లైన్ నంబర్. ఓటరు జాబితాలో పేరు చెక్ చేసుకొనేందుకు ఎస్ఎంఎస్ ద్వారా చెక్ చేసుకోవటానికి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి టెక్స్ట్ సందేశాన్ని పంపాల్సి ఉంటుంది. ముందుగా EPIC ఓటర్ ఐడీ నంబర్ నోట్ చేసుకుని పెట్టుకోవాలి.

చెక్ చేసుకోవటం ఇలా:ఎపిక్ ఓటర్ ఐడీ నెంబర్ ను సందేశం రూపంలో 1950కి పంపించాలి. దీని తర్వాత మీ నంబర్‌కు ఓ మెసేజ్ వస్తుంది. అందులో మీ పోలింగ్ బూత్ నంబర్, పేరు ఉంటాయి. ఒకవేళ ఓటరు జాబితాలో మీ పేరు లేకుంటే మీకు ఎలాంటి సమాచారం రాదు. అదే విధంగా..హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ఓటరు జాబితాలో పేరును ఎలా తనిఖీ చేయాలంటే...ఓటరు జాబితాలో మీ పేరును తనిఖీ చేయడానికి మీరు భారత ఎన్నికల సంఘం టోల్-ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) ప్రకారం మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. అనంతరం ప్రాంప్ట్ కాల్‌ను అనుసరించి 'ఓటర్ ఐడీ స్టేటస్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడే మన EPIC ఓటర్ ఐడీ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎపిక్ ఓటర్ ఐడీ నంబర్ ఇచ్చిన తర్వాత మన ఐడీ స్టేటస్ ఏంటనేది తెలుస్తుంది.
ఎన్నికల సంఘం సూచన:ఓటు వేయాలంలే ఓటరు జాబితాలో పేరు తప్పనిసరిగా ఉండాలి. పేరు ఉండి ఓటరు కార్డు లేకపోయినా..ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా గుర్తింపు పత్రం ద్వారా ఓటు వేయటానికి అనుమతి ఇస్తారు. ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు గురించి ఓటర్లకు ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది. ఇక, ప్రభుత్వ సిబ్బంది ఇళ్లకు వచ్చి ఓటర్లను ఓటర్ స్లిప్పులను పంపిణీ చేసారు. ఓటరు స్లిప్పులు అందని వారు సైతం ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకొనే అవకాశం కల్పించారు. పోలింగ్ డే అంటే హాలిడే కాదని..ఓటింగ్ డే అంటూ ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం కోరుతోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications