భూపతిరెడ్డిపై అనర్హత వేటు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 12న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది.
మార్చి 19 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 20న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఏప్రిల్ 7న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ఏప్రిల్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏప్రిల్ 13 వరకు ఈ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ముగుస్తుందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. భూపతిరెడ్డిపై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఎన్నిక జరుగనుంది.

టీఆర్ఎస్ తరపున ఎన్నికైన భూపతిరెడ్డి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. ఈ క్రమంలో ఆయనపై శాసనమండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో అనర్హత వేటుపై భూపతిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఛైర్మన్ నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. ఈ నేపథ్యంలోనే ఆ స్థానానికి ఏప్రిల్ 7న ఎన్నిక జరుగుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications