Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణాలో ఇప్పటి నుండే ఎన్నికల వేడి.. సీఎం కేసీఆర్ పై పెరుగుతున్న ఒత్తిడి

తెలంగాణాలో ఇప్పటి నుండే ఎన్నికల వేడి కొనసాగుతుంది. ప్రతిపక్ష పార్టీల కంటే సీఎం కేసీఆర్ పై ఒత్తిడి పెరుగుతున్నట్టు కనిపిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు వ్యూహాత్మకంగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పాదయాత్రల పేరుతో ప్రజల మద్దతును పొందడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఇక అధికార పార్టీ సైతం ప్రజలను ఆకట్టుకోవడానికి ఏం చేయాలి? ఎలా చేస్తే ప్రజలు వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనకు పట్టం కడతారు? అనే దానిపైన దృష్టి సారించి పనిచేస్తుంది. ఇక ఈ సమయంలో ఒకపక్క జాతీయ రాజకీయాలలోను, ఇంకో పక్క రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ పై తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది.

 ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షాలు

ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షాలు

ఒకప్పుడు ఎన్నికల ముందు కనిపించే వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి నుంచే కనిపిస్తుంది. తీరా ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళితే ఆదరణ రావడం లేదని భావిస్తున్న ప్రతిపక్ష పార్టీలు, ఇప్పటినుంచి ప్రజల్లోకి వెళుతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని శత విధాలా ప్రయత్నం చేస్తున్న బిజెపి, అధిష్టానం సూచనల మేరకు పక్కా ప్లాన్ తో ప్రజాక్షేత్రలో దూసుకుపోతుంది. స్ట్రీట్ కార్నర్ మీటింగులు, రథయాత్రలు అంటూ బిజెపి ప్రజల వద్దకు వెళుతుంది. హాత్ సే హాత్ జోడో యాత్ర అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటికి వెళ్లి ఈ ఒక్కసారికి కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వాలని జనాలను ప్రాధేయ పడుతున్నారు.

ఎన్నికల ఏడాది .. కేసీఆర్ పై తీవ్ర ఒత్తిడి

ఎన్నికల ఏడాది .. కేసీఆర్ పై తీవ్ర ఒత్తిడి

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తప్పనిసరిగా విజయం సాధిస్తారని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈసారి ఎన్నికలు గత ఎన్నికల కంటే భిన్నంగా, టఫ్ ఫైట్ ఉండబోతుందని ముందే గుర్తించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెక్ పెట్టడానికి ఏం చేయాలన్న దానిపై దృష్టి సారిస్తున్నారు. దీంతో ఆయనపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది.

సొంత పార్టీ నేతల తీరుతో చిరాకు పడుతున్న కేసీఆర్

సొంత పార్టీ నేతల తీరుతో చిరాకు పడుతున్న కేసీఆర్


ఇక మరో పక్క కెసిఆర్ పార్టీలో నేతల మధ్య సమన్వయ లేమి, ఎవరికి వారు పదవుల కోసం పాకులాడుతున్న తీరు, ప్రతి జిల్లాలోనూ ఉన్న అంతర్గత సమస్యలు కెసిఆర్ పై ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి. ఉద్యమ కాలంలో పనిచేస్తున్న నాయకులు, ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకుల మధ్య విభేదాలు వెరసి పార్టీలో ఉన్న సమస్యలు కెసిఆర్ కు తలనొప్పిగా మారుతున్నాయి.ఈ ఏడాది చివర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ల కోసం ఇప్పటినుంచే టిఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్న తీరు, సొంత పార్టీ నేతలపై చేస్తున్న రాజకీయాలు వెరసి కెసిఆర్ చిరాకును ఫేస్ చేయాల్సి వస్తుంది.

కేసీఆర్ కు ఇబ్బందిగా జాతీయ, రాష్ట్రంలోని పరిస్థితులు

కేసీఆర్ కు ఇబ్బందిగా జాతీయ, రాష్ట్రంలోని పరిస్థితులు

ఏది ఏమైనా జాతీయ పార్టీతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసిఆర్ కు ఇప్పుడు రాష్ట్ర, జాతీయ రాజకీయాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జాతీయ రాజకీయాలలో దేశం దృష్టిని ఆకర్షించడానికి కేసీఆర్ అనుసరిస్తున్న చాలా వ్యూహాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఇక ఈ క్రమంలో జాతీయ రాజకీయాలలో కీలక నేతగా నిలబడటం ఎలా అని ఆలోచిస్తున్న కేసీఆర్ కు రాష్ట్రంలోని పరిస్థితులు కూడా కాస్త ఇబ్బంది పెడుతున్నట్టుగా కనిపిస్తుంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఒత్తిడి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఒత్తిడి

ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూడా టికెట్ల కోసం ఆశవహుల నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉండడంతో కెసిఆర్ ఒత్తిడికి గురవుతున్నారు. మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆయనకు ఆశావహుల నుండి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది. ఇప్పుడు టికెట్లు ఎవరికి ఇస్తే వచ్చే ఎన్నికలలో లాభం జరుగుతుంది. ఎవరి వల్ల వచ్చే ఎన్నికలకు ఉపయోగం ఉంటుంది వంటి అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. బీఆర్ఎస్ లో నేతల ఆధిపత్య ధోరణి, తీవ్రమైన పోటీ నేపధ్యంలో ఆయన ఎలా పరిస్థితి చక్కదిద్దాలి అన్న దానిపై ఆలోచనలో ఉన్నారని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+