విషాదం: తీవ్ర అనారోగ్యంతో జమున మృతి
హైదరాబాద్‌లోని జంతు ప్రేమికులకు ఇది విషాదకరమైన వార్త. కొన్నేళ్లుగా నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఇటు జంతు ప్రేమికులను, అటు పర్యాటకులకు కనువిందు చేసిన జమున అనే ఏనుగు మృతి చెందింది. 44 ఏళ్ల జమున గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ ఏడాది మార్చి 14న జమున కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఇక అప్పటి నుంచి జూ అధికారుల పర్యవేక్షణలో ఉంది. గాయాలపాలవడంతో తీవ్ర నొప్పితో అల్లాడిన జమున, రాత్రివేళల్లో నిద్రపోయేది కాదని జూ అధికారులు వెల్లడించారు. జూ కన్సల్టెంట్ డాక్టర్ నవీన్ కుమార్ జమున అనే ఈ ఏనుగుకు చికిత్స అందిస్తున్నారు.
జమున ఆరోగ్యాన్ని పర్యవేక్షించి తగిన చికిత్స అందించేందుకు కోయంబత్తూర్ నుంచి డాక్టర్ మనోహరన్, కేరళకు చెందిన ఏనుగుల ఆరోగ్య నిపుణులు డాక్టర్ జయకుమార్, వెటరనరీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మజలు హైదరాబాద్ జూకు వచ్చారు. కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న జమునకు సరైన మోతాదులో యాంటీ బైటిక్స్ ఇచ్చినట్లు వీరు తెలిపారు. బుధవారం కుంటుకుంటూ వెళ్లిన జమునా ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిందని అధికారులు తెలిపారు. జమున గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిందని వైద్యులు పోస్ట్‌మార్టం అనంతరం వెల్లడించారు.

ఇదిలా ఉంటే జమున మృతితో జంతు ప్రేమికులు షాక్‌కు గురయ్యారు. జమునతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు జూ సిబ్బంది.
-
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications