పోలీసులు అవమానించారని, ఇంజనీరింగ్ విధ్యార్థి ఏం చేశాడో తెలుసా ?

ప్రేమ వ్యవహరంలో పోలీసులు, అమ్మాయి కుటుంబసభ్యులు తనను వేధించారనే నెపంతో ఓ ఇంజనీరింగ్ విధ్యార్థి ఆత్మహత్య చేసుకొన్నాడు. అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబసభ్యులు కోరుతున్నారు.

హైదరాబాద్ :పోలీసులు వేధించారనే మనోవేధనతో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన హైద్రాబాద్ లోని కూకట్ పల్లిలోన చోటుచేసుకొంది. తనతో పాటు తన తల్లిని అవమానించడంతో తట్టుకోలేక ఆ యువకుడు ఆత్మహత్యచేసుకొన్నాడు.నిందితులను కఠినంగా శిక్షించాలని విధ్యార్థి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలకేంద్రానికి చెందిన ఒల్లాల సాయిగౌగవ్ నిజామాబాద్ లో పాలిటెక్నిక్ చదివాడు. అక్కడ ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం జెఎన్ టి యూలో సాయిగౌతమ్ బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.

engineering student sucide in hyderabad

నిజాం పేటలోని ప్రైవేట్ హస్టల్ లో ఉంటున్నాడు. అయితే సాయి గౌతమ్ కు పాలిటెక్నిక్ లో పరిచయమైన అమ్మాయి కూడ ఇక్కడే చదువుకొంటోంది. పాత పరిచయం కారణంగా ఇద్దరూ తరచూ పోన్ లో మాట్లాడుకొనేవారు.

అయితే సాయి గౌతమ్ తో తమ కూతురు తరచూ పోన్ లో మాట్లాడుతోందనే విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు ఘట్ కేసర్ లోని పోలీస్ స్టేషన్ లో పనిచేసే తమ బంధువుకు చెప్పారు.
వీరంతా కలిసి అమ్మాయితో సాయి గౌతమ్ పై నిజాం పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేయించారు. పోలీసులు కేసు నమోదుచేశారు.మూడు రోజుల క్రితం పోలీసులు సాయి గౌతమ్ ఉండే హస్టల్ కు వచ్చి బేడీలు వేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు.

సాయిగౌతమ్, అతని తల్లి రేణుకను బూతులు తిట్టి ,జామీన్ పై విడిచిపెట్టారు. ఆ తర్వాత తల్లితో కలిసి ఇంటికి వచ్చిన సాయి గౌతమ్ సోమవారం ఉదయం తిరగి హైద్రాబాద్ కు వచ్చాడు. తనతో పాటు తన తల్లిని అవమానించారని మనస్థాపం చెందాడు.

సోమవారం సాయంత్రం హస్టల్ భవనంలో రెండో అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆత్మహత్యకు ముందుగానే ఆయన సూసైడ్ లెటర్ రాశాడు. ఈ లేఖలో తనతో పాటు తల్లిని అవమానించిన విషయాన్ని ఆయన రాశాడు.

సాయి గౌతమ్ ను స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు ఆయన మరణించాడు. తన కొడుకు మృతికి కారణమైన నిందితులపై చర్యలు తీసుకోవాలని సాయి గౌతమ్ తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది.సాయిగౌతమ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. అయితే దుబాయి లో ఉన్న తండ్రి వెంకటేశం దుబాయి నుండి బయలుదేరి వచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+