సింగర్స్, యాంకర్స్, డ్యాన్సర్స్ కోసం జిల్‌మోర్ యాప్: ప్రచారకర్త ఎస్పీ బాలు
హైదరాబాద్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నూతన యాప్ జిల్‌మోర్‌ను సోమవారం నాడు ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా శుభకార్యాలకు గాయనీ గాయకులను, వ్యాఖ్యాతలను, కళాకారులను సంప్రదించవచ్చు.

ఈ యాప్ ప్రచారకర్తగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యవహరిస్తారు. జిల్‌మోర్ యాప్ ద్వారా కళాకారులు ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. గాయకులు, యాంకర్లు, డ్యాన్సర్లు వంటి అన్ని రకాల కళాకారుల ఉపాధికి తోడ్పడేలా, వారి కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు జిల్‌మోర్ యాప్ అందుబాటులోకి వచ్చింది.
ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... అనేకమంది బాగా పాడగలరని, యాంకరింగ్ చేయలగరని, అయితే అవకాశాల కోసం ఎవరిని సంప్రదించాలో తెలియక మిన్నకుండి పోతున్నారని చెప్పారు.

ప్రతిభగల వారిని ప్రోత్సహించేందుకు, వారికి ఉపాధి కల్పించేందుకు జిల్‌మోర్ ఉపయోగపడుతుందన్నారు.జిల్‌మోర్ సీఈవో సారథి బాబు మాట్లాడుతూ... పదిహేను ఇరవై రకాల విభాగాలలో 120 మంది కళాకారుల వివరాలు నమోదయ్యాయని చెప్పారు. ఈ సేవలను మరింత విస్తరిస్తామన్నారు.












Click it and Unblock the Notifications