కెసిఆర్, కెటిఆర్, హరీష్ కాల్ లిస్టులు తీయండి: ఎర్రబెల్లి డిమాండ్
వరంగల్: తమ పార్టీ నేతలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, మత్రులు కెటి రామరావు, హరీష్‌రావు ప్రలోభపెట్టి కొన్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. వారి ఫోన్ లిస్టును బయటకు తీయాలని ఫిర్యాదు చేసినా తమను పట్టించుకోవడం లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.
తలసాని శ్రీనివాస యాదవ్‌కు మంత్రి పదవి ఆశపెట్టి పార్టీలోకి లాక్కున్నారన్నారు. వరంగల్ జిల్లా జెడ్పీటీసీలను లక్షలిచ్చి కొన్నారన్నారు. అవినీతిలో పండిన కేసీఆర్ నీతిమంతుడిలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మీది కాబట్టి తమ ఫిర్యాదు పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని ఎర్రబెల్లి తెలిపారు.

చర్చిలకు, మసీదులకూ ఇవ్వండి
ఇదిలావుంటే, కేసీఆర్ పాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సాగుతుందని మందకృష్ణ ఆరోపించారు. హిందూ దేవాలయాలను మాత్రమే సందర్శించి వాటి అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నారని ఆయన విమర్శించారు. లింగ, మత వివక్షతతో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
వేములవాడ, యాదాద్రి మాదిరిగానే మెదక్ చ ర్చ్, మక్కా మస్జీద్‌ల అభివృద్ధికి కూడా వంద కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం మనది సెక్యులర్ రాజ్యమని, కాని కే సీఆర్ దానికి విరుద్ధంగా మతప్రచారకుడిలా వ్యవహరిస్తున్నారని మంద కృష్ణ విమర్శించారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications