కెసిఆర్‌కు సిగ్గూ లజ్జ లేదు, తలసానికి గులాంగిరీ చేస్తా: ఎర్రబెల్లి
హైదరాబాద్: తమ పార్టీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా కొనసాగేందుకు అర్హుడు కాదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని తుడిపెట్టిందని దుయ్యబట్టారు.
గతంలో ఏ మంత్రి, ఎమ్మెల్యే వచ్చినా రాజీనామా చేయించి మరీ టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖఱ రావు ఇప్పుడు సిగ్గు,లజ్జా లేకుండా ప్రవర్తిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.స్పీకర్, గవర్నర్‌లను తన ఆధీనంలో పెట్టుకున్నారని, చివరకు రాజ్యాంగాన్ని సైతం ధిక్కరిస్తున్నారని విమర్శించారు.
ఓ పార్టీ నుంచి గెలుపొందిన వ్యక్తి రాజీనామా చేయకుండా మరోపార్టీ మంత్రిగా కొనసాగడం భారత దేశ చరిత్రలో ఎక్కడా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తలసాని రాజీనామా విషయంలో గవర్నర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుదోవ పట్టించారా, లేదంటే గవర్నర్‌కు ఇదంతా తెలిసే జరుగుతోందా అన్ని ప్రశ్నించారు.

రాజీనామా విషయంలో కోర్టును సైతం తప్పుదోవ పట్టించారన్నారు. గవర్నర్ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాలన్నారు. గవర్నర్‌కు నైతిక విలువలు ఉంటే తలసానిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ ఏ ఎన్నికల్లో నిలబడకుండా బహిష్కరణ వేటు వేయాలని ఎర్రబెల్లి అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తలసాని రాజీనామా చేశారని గవర్నర్‌ను తప్పుదోవ పట్టించారని ఆయన అన్నారు. ఎలాంటి లేఖనైనా స్పీకర్ నుంచే అసెంబ్లీ కార్యదర్శికి వెళ్తుందని, తలసాని 420 అని ఇప్పటికే అర్థమైందని, ఈ వ్యవహారం సిఎం కెసిఆర్, గవర్నర్ నరసింహన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తలసానితో పాటు ఈ వ్యవహారంలో కెసిఆర్, స్పీకర్ మధుసూదనాచారి, గవర్నర్ నలుగురూ ముద్దాయిలేనని ఆయన అన్నారు. దమ్ముంటే తలసాని రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలని, అప్పుడు తాన తలసానికి గులాంగిరీ చేస్తానని ఎర్రబెల్లి అన్నారు.
హైకోర్టు విభజనతో గవర్నర్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయం టీఆర్‌ఎస్ ఎంపీలకు తెలియదా అని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాలపై గట్టిగా పోరాడటం లేదని విమర్శించారు. కేంద్రంలో మంత్రి పదవుల కోసమే ఆరటపడుతున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసును పార్లమెంటులో ప్రస్తావించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications