వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈటెల మాటలు గులాబీకీ తూటాల్లా పరిణమించాయా..? రచ్చ చేస్తున్న రాజేందర్ వ్యాఖ్యలు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సహనంగా ఉండే వాడు సహనాన్ని కోల్పోతే ఏదో అనర్థం తప్పకుండా జరుగుతుందాటారు పెద్దలు. తన సహజ లక్షణమైన సహనాన్ని, ఒక్కసారిగా వదిలేసుకున్నారు. మాటలనే ఈటెలుగా సంధించారు. తెలంగాణలో ప్రకంపనలు సృష్టించారు. గులాబీ సేనలో సీనియర్ సైనికుడైన మంత్రి ఈటల రాజేందర్‌ ఒక్కసారిగా సహనాన్ని కోల్పోయారు. అగ్నిపర్వతం బద్దలైట్టు ఒక్కసారిగా భగ్గుమన్నారు. కొంత కాలంగా పత్రికల్లో, సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి దీటుగా, ఘాటుగా, నాటుగా సమాధానమిచ్చారు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసారు.

టీడీపీకి ప్రకాశం ఎమ్మెల్యే గుడ్ బై..!! టచ్ లో వైసీపీ నేతలు : జగన్ గ్రీన్ సిగ్నల్..!!టీడీపీకి ప్రకాశం ఎమ్మెల్యే గుడ్ బై..!! టచ్ లో వైసీపీ నేతలు : జగన్ గ్రీన్ సిగ్నల్..!!

 గులాబీ వనంలో ఈటల రగిల్చిన చిచ్చు..! చల్లారేలా కనిపించడం లేదు..!!

గులాబీ వనంలో ఈటల రగిల్చిన చిచ్చు..! చల్లారేలా కనిపించడం లేదు..!!

అంతే కాకుండా 'మేం ఈ గులాబీ జెండాకు ఓనర్లం. మేం బతికొచ్చినోళ్లం కాదు. మధ్యలో వచ్చినోళ్లం కాదు. గులాబీ జెండాను తెలంగాణ గడ్డ మీద గుబాళింపజేసిన మూడున్నర కోట్ల ప్రజల గొంతుకలం. రాష్ట్రాన్ని సాధించిన బిడ్డలం. అందుకే, మేం ఓనర్లం. అడుక్కొచ్చినోళ్లం కాదు' అంటూ, పదునైన మాటలను ఈటెలుగా ఈటల రాజేందర్‌ విసిరారు. తనకు మంత్రి పదవి ఎవరో వేసిన భిక్ష కాదని నిర్మొహమాటంగా చెప్పారు. వరంగల్ అర్బన్ జిల్లా హుజూరాబాద్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఇలా భావోద్వేగానికి లోనయ్యారు. నాలో బాధ ఉంది. అది బయటకు వచ్చే రోజు వస్తుంది. ఎవడు వీరుడో తెలిసే రోజు వస్తుంది అన్నారు.

ఈటల ఆక్రోశం ఎవరిమీద..? రాజేందర్ అంశంలో సీఎంది వ్యూహాత్మక నిశ్వబ్దమేనా..?

ఈటల ఆక్రోశం ఎవరిమీద..? రాజేందర్ అంశంలో సీఎంది వ్యూహాత్మక నిశ్వబ్దమేనా..?

దొర కొడుకు వచ్చినా.. సఫాయి బిడ్డ వచ్చినా నా టేబుల్‌ మీద తినగలిగే సత్తా నా దగ్గరే ఉంటది. ఇంకెక్కడ లేదు. ఉంటే, ముక్కు నేలకు రాస్తా. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాదు. మంత్రిగా ఉన్నప్పుడూ అంతే. అది మా సంస్కృతి. అరే.. పిచ్చి కొడకా రా చూపిస్తా, నేను మంత్రి అయినా ఇవాల్టికీ నా భార్య, కొడుకు చద్ది కట్టుకుని పౌల్ట్రీ ఫామ్ పోతరు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిన్నటి వరకు, నాకు క్షమించే గుణం ఉంది. అలాంటి వాళ్లకు గుణపాఠం తప్పదు అని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించడానికి కొంతమంది కుట్ర చేశారు. ఎవడెవడు ఏం చేసిండో, సందర్భం వస్తే బయట పెడతా అన్నారు.

 గులాబీ గూటిలో అసంతృప్తి సెగలు ఉన్నాయా..? నేతల మద్య విభాధాలు ఉన్నట్టేనా..?

గులాబీ గూటిలో అసంతృప్తి సెగలు ఉన్నాయా..? నేతల మద్య విభాధాలు ఉన్నట్టేనా..?

ఈటల రాజేందర్ మనసులో ఇంతటి ఆవేదనకు, ఆగ్రహానికి కారకులెవరు? స్వపక్షంలోని శతృవులను టార్గెట్ గా చేసుకుని ఈటల ఇలా విరుచుకుపడ్డారా? ఆ శతృవులు ఎవరు...? వారిని వెనుక నుంచి ఉసిగొల్పుతున్నది ఎవరు? గులాబీ పార్టీలోకి బతికొచ్చినోళ్లు ఎవరు? అరే.. పిచ్చి కొడకా.. రా.. అని, ఎవరికి సవాల్ విసిరారు...? గుణపాఠం తప్పదు అని ఎవరినుద్దేశించి హెచ్చరించారు...? ఎన్నికల్లో ఆయనను ఓడించడానికి కుట్రలు పన్నిందెవరు...? ఆయనే చెప్పినట్టుగా, ఎవడెవడు ఏం చేశారు..? చరిత్ర నిర్మాతలు.. నాయకులు కాదు, ప్రజలే... అని, ఎవరినుద్దేశించి అన్నారు...?

 ఈటల ఎవరిని ఉద్దేశించి రెచ్చిపోయారు..! త్వరలో వివరణ ఇస్తానంటున్న రాజేందర్..!!

ఈటల ఎవరిని ఉద్దేశించి రెచ్చిపోయారు..! త్వరలో వివరణ ఇస్తానంటున్న రాజేందర్..!!

ఈటల రాజేందర్ భావోద్వేగ ఉపన్యాసం తరువాత... ఆయన నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణుల్లో, అనుచరుల్లో మాత్రమే కాదు. యావత్ తెలంగాణలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ లో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. హరీష్ రావుకు ఈటల రాజేందర్ చాలా దగ్గరి మనిషన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఇప్పటికే, హరీష్ రావును సీఎం చంద్రశేఖర్ రావు పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. హరీష్ రావుకు సన్నిహితుడైన రాజేందర్ ఇలా బాహాటంగా బయటపడ్డారు. రాజేందర్ లాగా అసహనంతో ఇంకెంతమంది ఉన్నారు...? వారంతా, ఈ ఈటల రాజేందర్ లాగానే అసహనం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయా? సరిగ్గా, ఇలాంటి పరిణామం కోసమే ఎదురుచూస్తున్న బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుందా...? తెలంగాణలో ఈటెల రగిల్చిన అసంతృప్తి చిచ్చు ఎంత వరకు రగులుతుంటుంది..? కాలమే సమాధానం చెప్పాలి.

English summary
He left his natural characteristic of endurance. Words were put into the spear. Tremors were created in Telangana. The senior minister in the Rose Army, Etala Rajendar, was suddenly lost in patience. The volcano is breaking down suddenly. For some time, the magazines and the social media have been replying to his propaganda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X