కస్టడీకి షీ టీమ్ పిటిషన్, కామపిశాచి మధు ఎఫెక్ట్.. హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ సిస్టం మార్పు

హైదరాబాద్: వేలాదిమంది యువతులకు వలవేసిన కామపిశాచి మధును తమ కస్టడీకి ఇవ్వాలని షీ టీమ్ పిటిషన్ దాఖలు చేసింది. మధును ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరింది. అతని నుంచి సేకరించిన సెల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఎస్ఎఫ్ఎల్ నివేదికకు పంపిస్తున్నారు.

మధు వ్యవహారం నేపథ్యంలో... ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కామపిశాచి మధు అమ్మాయిల హాల్ టిక్కెట్లను ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసి కిరాతకానికి ఒడిగట్టాడు.

ఈ నేపథ్యంలో ఎడ్యుకేషనల్ వెబ్ సైట్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న హాల్ టిక్కెట్ల డౌన్ లోడ్ పద్ధతిని మార్పు చేయాలని నిర్ణయించింది.

కాగా, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ముసుగులో కామ పిశాచి మధు ఐదు వేల మంది యువతులకు వల వేసిన విషయం తెలిసిందే. ఇందులో 300 మందిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. బయటకు చెప్తే తనతో ఉన్న ఫొటోలు నెట్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడు.

షీ టీమ్స్‌కు వచ్చిన ఒక ఫిర్యాదుతో పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజర్ బాగోతం బయటపడింది. అతడి ఇంట్లో పోలీసులు సోదాలు చేసినప్పుడు... పదుల సంఖ్యలో గర్భ నిరోధక మాత్రల డబ్బాలు (ఐ పిల్స్‌), ఐదువేల మంది అమ్మాయిలతో ‘డేటా బ్యాంక్‌', పెద్దసంఖ్యలో సెల్‌ఫోన్లు బయటపడ్డాయి.

Ex manager arrested for sexually exploiting, She Team petition

ఈ సైకో సంగతులను శుక్రవారం హైదరాబాద్‌ అడిషనల్‌ పోలీసు కమిషనర్‌ స్వాతి లక్రా మీడియాకు తెలిపారు. ఈ సైకో అసలు పేరు కలబంద మధు. వయసు 33 సంవత్సరాలు. స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. నల్లగొండలో 2007లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా చేరాడు. 2011లో హైదరాబాద్‌కు బదిలీ అయ్యాడు.

బుద్ధి పెడదారిపట్టడంతో... ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అయ్యాడు. నగరం చేరాక అతడిలోని వికృత మనస్తత్వం బయటపడింది. లైంగిక అవసరాలు తీర్చుకునేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. నాగోలు సమీపంలోని బండ్లగూడ, సాయినగర్‌కాలనీలో రెండు ఇళ్లు అద్దెకు తీసుకున్నాడు.

యూనివర్సిటీలో చదివిన అనుభవం ఉండడంతో వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఇంటర్‌నెట్‌లోని ఆయా విద్యాసంస్థల వెబ్‌సైట్ల నుంచి తెలుసుకున్నాడు. కొత్తపేటలోని ఇండియన్ ఇంటర్‌నెట్ పాయింట్‌కు వెళ్లి అక్కడ శివ అనే ఆపరేటర్ సహాయంతో కొత్తగా ఇంటర్‌లో చేరిన వారి ప్రొఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు.

ఇలా ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ, ఓయూసెట్-2015కు దరఖాస్తు చేసుకున్న యువతులకు సంబంధించిన 5వేల ప్రొఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేశాడు. వాటిలోని ఫోన్ నెంబర్లను తీసుకొని ఒకో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌కు ఒకో రిజిస్టర్ తయారు చేశాడు. చైతన్యపురిలో రోడ్డుపై సిమ్‌కార్డులు విక్రయించే వారి నుంచి బింగి మహేశ్వరి అనేపేరుతో నకిలీ పత్రాలు ఇచ్చి 5 సిమ్‌కార్డులు పొందాడు.

పంజాగుట్ట చౌరస్తాలోనూ నకిలీ ధ్రువపత్రాలతో గజ్జల్వార్ సతీశ్ పేరుతో 7 సిమ్‌కార్డులు తీసుకున్నాడు. ఈ సిమ్‌కార్డులతో ఐదు వేల మందికి ఫోన్లు చేస్తూ.. ఒక్కోపేరుతో వారితో మాట్లాడుతున్నాడు. ఇలా సతీశ్, శ్రీనివాస్, రవి, వెంకట్‌రెడ్డి, వెంకట్ అనే పేర్లతో మాట్లాడేవాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+