ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు 50రోజులు.. ఇది చరిత్రలో నిలిచిపోయే అప్రదిష్ట!
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పైకప్పు కూలిన ఘటన జరిగి నేటికి 50 రోజులు. అయితే నేటికీ ఈ ఘటన తాలూకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనలో టన్నెల్ లోపల చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడడానికి రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది వారిని కాపాడడంలో విఫలమయ్యారు. ఇప్పటివరకు రెండు మృతదేహాలు మినహాయించి ఆరు మృతదేహాల జాడ తెలియలేదు.
ఎస్ఎల్బీసీ ఘటనపై బీఆర్ఎస్ ఫైర్
నేటికీ ndrf, sdrf, హైడ్రా, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాయి. మృతదేహాలను గుర్తించి బయటకు తీయడం కోసం రోబోలను రంగంలోకి దించిన ఫలితం మాత్రం శూన్యంగా మారింది. రోబోలు పనిచేయడం మానేసి చివరకు వాటిని పక్కకు పెట్టి మళ్లీ మ్యానువల్ పద్ధతిలోనే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు మిగిలిన ఆరుగురి మృతదేహాలు బయటకు తీసుకురాలేకపోవడంతో ప్రభుత్వంపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

సహాయక చర్యల్లో పురోగతి లేదన్న మాజీ మంత్రి
తాజాగా బీఆర్ఎస్ మాజీమంత్రి సీనియర్ నాయకుడు హరీష్ రావు ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి లేదని ప్రభుత్వ అసమర్థత పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన 50 రోజులైనా ఇప్పటివరకు ఎటువంటి పురోగతి సాధించలేని ప్రభుత్వ నిర్లక్ష్యం బాధాకరమని పేర్కొన్నారు. టన్నెల్ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య రోదనగా మారిందని వారి వేదన పట్టించుకునే వారే లేరన్నారు.
పబ్లిసిటీ కోసం వెళ్లి రావడం తప్ప ఇప్పటివరకు చేసిందేమీ లేదు
ప్రభుత్వ నిర్లక్ష్యం ఎనిమిది మంది కుటుంబాలలో విషాదం నింపిందని, బాధితులను కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు, మంత్రులు టన్నెల్ వద్దకు హెలికాఫ్టర్ లో పబ్లిసిటీ కోసం వెళ్లి రావడం తప్ప ఇప్పటివరకు చేసిందేమీ లేదని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షలు చేయడం తప్ప సమస్య పరిష్కారం కోసం అన్వేషించింది కూడా లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ట
కాంగ్రెస్ ప్రభుత్వం టన్నెల్ లో చిక్కుకున్న వారిని కాపాడడం కోసం తీసుకున్న నిర్ణయాల విషయంలో తీవ్ర జాప్యం చేసిందని, ఫలితంగా ఎనిమిది మంది కుటుంబాలు శోకసంద్రంలో మునిగి పోయాయని హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. సహాయక బృందాలను సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ట అని మాజీ మంత్రి హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
slbc ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్
లోపల చిక్కుకున్న ఆరుగురి పరిస్థితి ఏంటి? అంటూ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కూటి కోసం, కూలి కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. slbc ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, అసలు ఏం జరిగింది అనే వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని హరీష్ రావు అన్నారు. తీవ్ర దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications