మందుబాబులకు పండుగ - సూపర్ కిక్కు, ఇక నుంచి కొత్తగా..!!

ఫుల్ కిక్కే కిక్కు. మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖకు ఒక్క నెలలోనే భారీగా ఆదాయం సమకూరింది. ఏకంగా రూ.6,348 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. కొత్త మద్యం పాలసీలో భాగంగా అందిన దరఖాస్తుల ఫీజులు, లైసెన్స్‌ ఫీజుల రూపంలో ఏకంగా రూ.3,180 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. అక్టోబరు నెలలో వరుస పండుగ లు రావడంతో మద్యం అమ్మకాల ద్వారా రికార్డు స్థాయిలో రూ.3,168 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో, ప్రభుత్వానికి ఆర్దికంగా వెసులుబాటు కలిగింది.

ఎక్సైజ్ శాఖ అంచనాలకు మించి ఆదాయం వచ్చింది. ఒక్క నెల రోజుల సమయంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రెట్టింపు స్థాయిలో ఆదాయం రావడం ఎక్సైజ్‌ శాఖ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు రెండేళ్ల కాలపరిమితికి కొత్త లైసెన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించారు. కొత్త పాలసీలో మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచింది. రెండేళ్ల క్రితం 1.32లక్షల మంది దరఖాస్తు చేయగా.. రూ.2,645 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సారి దరఖాస్తు ఫీజు పెంచినప్పటికీ మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి 95,628 మంది పోటీపడ్డారు. ఫలితంగా కేవలం దరఖాస్తుల విక్రయం ద్వారానే ఎక్సైజ్‌ శాఖకు రూ.2,868.8 కోట్ల ఆదాయం వచ్చింది.

excise-revenue-set-new-record-in-the-last-month-with-new-liquor-policy-here-the-details

అదే సమయంలో లాటరీలో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారులు మొదటి విడతలో లైసెన్స్‌ ఫీజులో ఆరో వంతు మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించడంతో అదనంగా మరో రూ.313 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. మరోవైపు.. అక్టోబరు నెలలో పండుగలు, జాతరల కారణంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది అక్టోబరులో మద్యం అమ్మకాల ద్వారా రూ.2,987కోట్ల ఆదాయం రాగా.. ఈ సారి రూ.3,168 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో మొత్తం ఆదాయం నెల రోజుల్లోనే రూ.6,348 కోట్ల మార్కును దాటింది. భారీ ఆదాయంతో ప్రభుత్వ ఖజానాకు ఉపశమనం కలిగింది. ఇక.. కొత్త మద్యం దుకాణాలు రావటంతో.. చాలా కాలంగా ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్న కొత్త బ్రాండ్ల పైన వచ్చే వారం నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+