Exit poll India TV CNX: తెలంగాణలోనూ కాంగ్రెస్‌ను డామినేట్ చేసిన బీజేపీ
తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. శనివారం లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఈ రెండు పార్టీలో దాదాపు సమానంగా సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని తేలుతోంది. కొన్ని సర్వేల్లో బీజేపీ పైచేయి సాధించగా.. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని పేర్కొన్నాయి.
తాజాగా, ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెలువరించింది. బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. తెలంగాణలో బీజేపీకి 8-10, కాంగ్రెస్‌కు 6-8 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చింది. ఇక, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 0-1, ఎంఐఎంకు 1 లోక్‌సభ స్థానంలో గెలిచే అవకాశం ఉందని తెలిపింది.

ఏబీపీ సీ ఓటర్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్
తాజాగా, వెలువడిన ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 7-9 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, బీజేపీకి కూడా 7-9 నుంచి సీట్లు వస్తాయని తెలిపింది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని తేల్చింది. ఎంఐఎం పార్టీకి ఒక సీటు వస్తుందని పేర్కొంది.
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 4-7 సీట్లు వస్తాయని తెలిపింది. అయితే, బీజేపీ మాత్రం 9 - 12 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఇక, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు చెరో స్థానం దక్కే అవకాశం ఉందని వెల్లడించింది.
న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ ఇలా..
తెలంగాణా లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అత్యధిక స్థానాలు దక్కించుకుంటుందని న్యూస్18 మెగా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని 17 సీట్లలో బీజేపీకి 7-10 సీట్లు, దాదాపు 37% ఓట్ల వాటాను అంచనా వేసింది. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌కు దాదాపు 34% ఓట్లతో 5-8 సీట్లు రావచ్చు.
భారత్ రాష్ట్ర సమితి (బీర్‌ఎస్), ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం)తో సహా ఇతరులు 3-5 సీట్లు సాధించవచ్చని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఎగ్జిట్ పోల్ బీఆర్ఎస్‌కి 21%, ఏఐఎంఐఎంకి 3% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఏది ఏమైనా జూన్ 4న విడుదలయ్యే అసలైన ఫలితాల కోసం వేచిచూడాల్సిందే.












Click it and Unblock the Notifications