లేడీ ఎఎస్పీతో సిఐ బాగోతం: వారిద్దరినీ కలిపింది ఒటుకు నోటు కేసు
హైదరాబాద్: ఏఎస్పీ సునీతారెడ్డితో సిఐ మల్లికార్డున్ రెడ్డిల మధ్య వివాహేతర సంబంధం గుట్టు రట్టయిన నేపథ్యంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు దర్యాప్తు సమయంలో వారిద్దరికి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు చెబుతున్నారు.
Recommended Video

ఓటుకు నోటు దర్యాప్తు వేళలో వారిద్దరు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకునేవారని, అదే వారి మధ్య సాన్నిహిత్యానికి కారణమని అంటున్నారు. తన భర్తతో కలిసి ఉండలేనని సునీతా రెడ్డి ఆ సమయంలో మల్లికార్డున్ రెడ్డితో చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

తాను కూడా అంటూ....
తనకు కూడా భార్యతో సంబంధాలు సజావుగా లేవని, ఒప్పుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకుందామని మల్లికార్జున్ రెడ్డి సునీతారెడ్డి వద్ద ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇంతలో ఓటుకు నోటు కేసు నమోదై, వారే కేసును దర్యాప్తు చేయడంతో వారి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగిందని వార్తలు వచ్చాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సిఐ మల్లికార్జున్ రెడ్డిని ఎసిబి నుంచి బదిలీ చేశారు. అయినా వారు తరుచుగా కలుస్తుండేవారని చెబుతున్నారు.

మల్లికార్జున్ రెడ్డి వాట్సప్ వివరణ
వివాదంపై కల్వకుర్తి సిఐ మల్లికార్డున్ రెడ్డి వివరణ పేరుతో ఓ వాట్సప్ సందేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమది వివాహేతర సంబంధం కాదని, అధికారికంగానే వివాహం చేసుకుందామని అనుకున్నామని మల్లికార్డున్ రెడ్డి అన్నట్లు అందులో ఉంది.

డ్రాప్ చేయడానికే వెళ్లా...
ఆదివారం రాత్రి సునీతారెడ్డిని ఇంటి వద్ డ్రాప్ చేయడానికి వెళ్లానని ఆ వాట్సప్‌లో వివరణ ఇచ్చారు. సునీతతో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని, ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకున్నరాని, విడాకుల తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని ఆయన అన్నారు. ఆ విషయాన్ని తాను సునితారెడ్డి భర్తకు కూడా చెప్పినట్లు ఆ వాట్సప్ సందేశంలో ఉంది.

మీడియా ముందుకు వస్తాం...
తన భార్యతో తనకు సఖ్యత లేదని, త్వరలోనే ఇద్దరం మీడియా ముందుకు వస్తామని, పూర్తి వివరాలు వెల్లడిస్తామని మల్లికార్జున్ రెడ్డి పాట్సప్ పేర ప్రచారంలో ఉన్న సందేశంలో ఉంది. అయితే, మల్లికార్జున్ రెడ్డి తన భార్యను ట్రాప్ చేశాడని సురేందర్ రెడ్డి అంటున్నారు. గతంలో వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించానని, ఇక ముందు అలా చేయబోమని హామీ ఇచ్చారని ఆయన అంటున్నారు.

మళ్ల వారిద్దరు దగ్గరయ్యారు....
మళ్లీ మూడు నెలల నుంచి వాళ్లిద్దరు దగ్గరయినట్లు సురేందర్ రెడ్డి చెప్పారు. సిఐ చేతిలో మరో యువతి మోసపోకుండా ఉండడానికే ఇద్దరిపై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్‌ా సునీతారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పట్టుకున్నామని ఆయన చెప్పారు. మల్లికార్జున్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సునీతారెడ్డి తల్లి, అత్త డిమాండ్ చేశారు.

సురేందర్ రెడ్డి అమెరికాలో ఉద్యోగం...
ఏఎస్పీ సునీతారెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె ఇంద ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అపార్టుమెంట్ 13వ ఫ్లోర్‌లో నివసిస్తున్నారు. వివాహేతర సంబంధం గురించి సురేందర్ రెడ్డికి రెండేళ్ల క్రితం తెలిసింది. దీంతో కుటుంబ సభ్యుల మందు మల్లికార్డున్ రెడ్డిని నిలదీశారు.

వారిని ఇలా పట్టుకున్నారు...
తన భార్య సునీతారెడ్డి మల్లికార్డున్ రెడ్డితో చాటింగ్ చేస్తున్నట్లు సురేందర్ రెడ్డి గర్తించారు. ఆ విషయాన్ని మల్లికార్డున్ రెడ్డి కుటుంబ సభ్యులకు, సునీతారెడ్డి తల్లికి, తన తల్లికి చెప్పారు. ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్స్ గేటెడ్ కమ్యూనిటీ హౌస్‌లో సునీతారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి ఉన్నారనే సమాచారంతో ఆదివారం వారంత అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. సిఐ మల్లికార్డున్ రెడ్డిని సునీత తల్లి, అత్త రోడ్డు మీద పరిగెత్తించి, చెప్పులతో తరిమి కొట్టారు. మర్నాడు సోమవారం సురేందర్ రెడ్డి మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్‌ను కలిశారు.

ఇలా ఫిర్యాదు చేశారు...
సిఐ మల్లికార్డున్ రెడ్డి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి తన భార్యను లోంగదీసుకున్నాడని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సురేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సునీత, సురేందర్ రెడ్డిలకు 2010లో పెళ్లయింది రెండేళ్ల క్రితం ఇరువురి మధ్య స్పర్థలు వచ్చాయి. 15 రోజుల క్రితం ఇరువురికి మధ్య గొడవ జరిగింది. సురేందర్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు.

అమెరికా వెళ్లినట్లే వెళ్లి
అమెరికాకు వెళ్లినట్లే వెళ్లిన సురేందర్ రెడ్డి భార్యకు తెలియకుండా హైదరాబాద్ తిరిగి వచ్చారు. వారిని పట్టుకోవడానికి మూడు రోజుల నుంచి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మల్లికార్డున్ రెడ్డి మూడు రోజులుగా సునీతారెడ్డి ఇంట్లోనే ఉంటున్నట్లు సమాచారం. తాజాగా ఆదివారంనాడు సురేందర్ రెడ్డి ఆదివారం అపార్టుమెంట్‌కు వచ్చారు. అక్కడి మల్లికార్డున్ రెడ్డి కారును చూశారు. బంధువులకు సమాచారం ఇచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications