అక్రమ సంబంధానికి అడ్డని భర్తను చంపేసిన మహిళ
ఖమ్మం: తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కోపంతో ఓ మహిళ తన భర్తనే పొట్టన పెట్టుకుంది. ఖమ్మం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చెడు తిరుగుళ్లు మానేయాలని మందలించిన పాపానికి భర్తపై ఆగ్రహించిన భార్య అతన్ని గొడ్డలితో నరికి చంపింది.
ఖమ్మం జిల్లా పాల్వంచలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో ఈ దారుణ సంఘటన శనివారంనాడు జరిగింది. గోపాలకృష్ణ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతని భార్య రాములమ్మ అదే కాలనీకి చెదిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం నెరుపుతోంది.

విషయం తెలిసిన గోపాలకృష్ణ తీరు మార్చుకోవాలనే ఆమెను మందలించాడు. అయినా వినకపోవడంతో భార్యాభర్తల మద్య గొడవలు జరుగుతుండేవి. గత రెండు రోజులుగా వారి మధ్య తగాదా తీవ్ర స్థాయికి చేరుకుంది. శుక్రవారం రాత్రి నిద్రిస్తున్న భర్తను అదును చూసి గొడ్డలితో రాములమ్మ నరికి చంపింది.
భర్తను చంపిన తర్వాత ఆమె పరారైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు. రాములమ్మను, ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతున్న యువకుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications