వివాహేతర సంబంధం: అడ్డొస్తోందని భార్యను హతమార్చిన భర్త
వరంగల్: వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని రాపోలు మల్లేష్ అనే వ్యక్తి తన భార్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని ఇంతెజార్‌గంజ్ సీఐ రవికుమార్ తెలిపారు. బుధవారం రాత్రి ఇంతెజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో మీడయా సమావేశంలో సీఐ రవికుమార్ వివరాలు వెల్లడించారు.
మహబూబాబాద్ వాస్తవ్యులైన రాపోలు మల్లేష్, లక్ష్మి(30) దంపతులు బతుకుదెరువు కోసం వరంగల్‌కు వచ్చి, గిర్మాజీపేట వివేకానంద కాలేజీ వెనక నివాసముంటున్నారు. మల్లేష్‌కు ఉన్న వివాహేతర సంబంధం కారణంగా ఇంట్లో తరచూ గొడవలు జరిగేవన్నారు. సోమవారం సాయంత్రం రాపోలు మల్లేష్ భార్య లక్ష్మితో గొడవ పడ్డాడు.

అడ్డును తొలగించేందుకు భార్యను కొట్టి, గొంతు నులిమి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చీరతో మెడకు ఉరివేసి మల్లేష్ ఇంటి నుంచి పారిపోయాడన్నారు. మల్లేష్‌ను బుధవారం అరెస్టు చేసి కోర్టులో రిమాండ్‌కు పంపుతున్నట్లు తెలిపారు.
గొంతులో బాటిల్ మూత ఇరుక్కొని చిన్నారి మృతి
జనగామ: కూల్‌డ్రింక్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కొని ఓ చిన్నారి మృతి చెందింది. జనగామ మండలం పెంబర్తికి చెందిన ఇట్టెబోయిన కనకరాజు-లలిత దంపతుల చిన్న కూతురు మల్లిక (9 నెలలు) మాజా బాటిల్ మూతతో ఆడుకుంటుండగా, గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక చిన్నారి విలవిలలాడింది. హుటాహుటిన ఏరియా అస్పత్రికి తరలించేలోగా కన్నుమూసింది. అనంతరం ఆస్పత్రి వైద్యులు ఆ మూతను గొంతు నుంచి తీశారు.












Click it and Unblock the Notifications