వివాహేతర సంబంధం, భార్య, ఆమె ప్రియుడిపై కత్తితో దాడి
రంగారెడ్డి: హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. దానయ్య అనే వ్యక్తి అనుమానంతో భార్య రాములమ్మతోపాటు అశోక్ అనే వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. భర్త దాడిలో రాములమ్మకు మెడతోపాటు పలు శరీర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి.
ఆదివారం తెల్లవారుజామున అశోక్‌కు చెందిన చికెన్ షాప్ వద్ద దానయ్య, అశోక్‌లు ఘర్షణ పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం దానయ్య భార్య రాములమ్మ, అశోక్‌లపై కత్తితో దాడికి పాల్పడి పరారయ్యాడు.

తీవ్ర గాయాలపాలైన బాధితులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, నిందితుడు దానయ్య పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.
అరుణోదయ కాలనీలో భారీ చోరీ
హైదరాబాద్: హైదరాబాద్ నాగోల్‌లో గల అరుణోదయ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కొందరు దుండగులు ఇంట్లో ఉన్న 47 తులాల బంగారం, కిలో వెండి, రూ. 45 వేలను అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications