ప్రేమ విఫలం: ముఖానికి కవర్ చుట్టుకుని కారులో ఆత్మహత్య

కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మలేసియా టౌన్‌షిప్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ విఫలమైందని మనస్థాపం చెందిన ఓ యువకుడు కారులోని ముఖానికి కవర్ చుట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హైదరాబాద్‌: కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మలేసియా టౌన్‌షిప్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ విఫలమైందని మనస్థాపం చెందిన ఓ యువకుడు కారులోని ముఖానికి కవర్ చుట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కాగా, శనివారం ఉదయం టౌన్‌షిప్‌ బ్లాక్‌ నెం.37 వద్ద ఆగి ఉన్న కారు నుంచి దుర్వాసన రావడంతో వాకింగ్‌కు వెళ్తున్న వారు గమనించి టౌన్‌షిప్‌ సంక్షేమ సంఘానికి చెప్పారు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కారులో యువకుడి మృతదేహాన్ని గుర్తించారు.

 Failed In Love, Youth Smothers Himself To Death

ఆ కారులో లభించిన సూసైడ్‌ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు దినేష్‌ అని, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వైఫల్యం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో ఉందని పోలీసులు తెలిపారు.

ముఖానికి కవర్‌ కట్టుకొని సిలండర్‌ ద్వారా గ్యాస్‌ లీక్‌ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న కారు(టీఎస్‌07ఈసీ1770).. హైదర్‌నగర్‌ ధర్మారెడ్డి కాలనీకి చెందిన ఫేస్‌2 మాణిక్యప్రసాద్‌ నిట్టలదిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+